AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న గ్రామాలు.. ప్రాణాలకు తెగించి మండుటెండలో మహిళల సాహసం

ఎండల తీవ్రత వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలిపోతుంటే.. మరో వైపు తాగునీటి కొరత నానాటికి తీవ్ర రూపం దాల్చుతోంది. అడుగంటిన బావులు, ఎండిన చెరువుల వల్ల ప్రజలు చుక్కనీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పెయింట్ గ్రామం..

Maharashtra: గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న గ్రామాలు.. ప్రాణాలకు తెగించి మండుటెండలో మహిళల సాహసం
Maharashtra
Srilakshmi C
|

Updated on: May 18, 2023 | 4:04 PM

Share

ఎండల తీవ్రత వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలిపోతుంటే.. మరో వైపు తాగునీటి కొరత నానాటికి తీవ్ర రూపం దాల్చుతోంది. అడుగంటిన బావులు, ఎండిన చెరువుల వల్ల ప్రజలు చుక్కనీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పెయింట్ గ్రామం తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతోంది. నీళ్ల కోసం ఆ గ్రామ ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర రీతిలో బావి నుంచి నీళ్లు సేకరిస్తున్నారు. ఇక్కడ నీటి ఎద్దడి కారణంగా మహిళలు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి నేల బావి నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న బకెట్లు, డబ్బాలకు తాళ్లు కట్టి ప్రమాదకర రీతిలో నీళ్లు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైలర్‌ అవుతోంది. ఒక్క నాసిక్ జిల్లాలోని పెయింట్ గ్రామంలోనే కాకుండా మహారాష్ట్రలోని అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి.

దీనిపై ఆ రాష్ట్ర మంత్రి దాదాజీ భూసే మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ కింద నీటిని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రభావిత గ్రామాలకు సమీపంలోని డ్యామ్ నుంచి త్రాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని సహపూర్ గ్రామానికి చెందిన మహిళలు గత 10 రోజులుగా తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. తాగు నీళ్ల కోసం ఆ రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు సైతం జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎంటువంటి సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తీవ్ర నీటి కొరతను వ్యతిరేకిస్తూ మంగళవారం దాదాపు 50 మంది మహిళలు ఖాళీ బకెట్లు, పాత్రలతో వీధుల్లోకి వచ్చారు. ఈ సమస్యపై అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.