AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖలో మళ్లీ మత్తు ఇంజెక్షన్ల కలకలం.. 8 మంది అరెస్ట్, 7 వేల ఇంజక్షన్లు సీజ్‌

విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్ల ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మంది పట్టుబడ్డారు. రెండు రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో మూడు మత్తు ఇంజక్షన్ల కేసులు నమోదవడం స్థానికంగా చర్చణీయాంశమైంది. వివరాల్లోకెళ్తే..

Narcotics Injections
Srilakshmi C
|

Updated on: May 18, 2023 | 6:58 PM

Share

విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్ల ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మంది పట్టుబడ్డారు. రెండు రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో మూడు మత్తు ఇంజక్షన్ల కేసులు నమోదవడం స్థానికంగా చర్చణీయాంశమైంది. వివరాల్లోకెళ్తే..

గంజాయి, మత్తు ఇంజక్షన్లకు విశాఖ కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ ఇక్కడ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. యువతను టార్గెట్‌ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ముఠాపై నిఘా పెట్టారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఏడు వేల మత్తు ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. రెండు రోజుల్లో మూడు కేసుల్లో వీటిని పట్టుకున్నారు.

నిందితుల నుంచి ఏడువేల మత్తు ఇంజెక్షన్లతో పాటు ఓ కారు,నగదు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్‌ చేశారు. ఇటీవల డ్రగ్స్‌ వినియోగం పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెట్టగా కేటుగాళ్లు అడ్డంగా బుక్కయ్యారు. వైజాగ్‌లో ఈ ఇంజక్షన్స్ విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఇటువంటి నీచుల్ని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?

రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో

పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!

తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు

చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..

ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..

OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి

కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?

నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ