Ranga Reddy: బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు

స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మందితో ఓఫియన్ పార్కుకు వెళుతన్న కారు అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను..

Ranga Reddy: బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు
Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: May 19, 2023 | 3:39 PM

స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మందితో ఓఫియన్ పార్కుకు వెళుతన్న కారు అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. శంకర్ పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిజాంపేట్‌కు చెందిన దివ్యతోపాటు ఆమె స్నేహితులు మొత్తం 12 మంది బ్యాచిలర్ పార్టీ నిమిత్తం గండిపేట్‌కు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. నిజాంపేట నుంచి బయలుదేరి శంకర్‌పల్లి మీదుగా కారులో ఓషియన్ పార్క్‌కు బయలుదేరారు. రోడ్డుపై మితిమీరిన వేగంతో డ్రైవ్‌ చేస్తూ రోడ్డుపై ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేయసాగారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఖానాపూర్ వద్ద పోచమ్మ గుడి దేవాలయం వద్ద నిలిచి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దివ్యతో పాటు మరో మరో అమ్మాయిలు, ఒక అబ్బాయి దుర్మరణం చెందారు. గమనించిన స్థానికులు హుటాహుటీన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కారులో ఇరుకున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీని వెనుక నుంచి మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..