AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Statue: ఎన్టీఆర్‌ విగ్రహంలో కీలక మార్పులు.. హైకోర్టు తీర్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

ఖమ్మంలో ఏర్పాటు చేయతలపెట్టిన శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహంపై యాదవ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. ఆందోళనలు చేయడంతో పాటు.. విగ్రహంపై అభ్యంతరం తెలుపుతూ పలు హిందూ , యాదవ సంఘాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి.

Janardhan Veluru
|

Updated on: May 19, 2023 | 2:48 PM

Share

ఖమ్మంలో ఏర్పాటు చేయతలపెట్టిన శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహంపై యాదవ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. ఆందోళనలు చేయడంతో పాటు.. విగ్రహంపై అభ్యంతరం తెలుపుతూ పలు హిందూ, యాదవ సంఘాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని.. అయితే శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు సరికాదంటూ వారి తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే రావడంతో వెంటనే ఎన్టీఆర్ విగ్రహ కమిటీ సభ్యులు, ఎన్నారైలు స్పందించారు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలపై దృష్టి పెట్టారు.

యాదవ సంఘాల అభ్యంతరాల మేరకు విగ్రహంలో మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఎన్టీఆర్ విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగానే విగ్రహంలోని పింఛం, పిల్లనగ్రోవి తొలగించేందుకు ఓకే చెప్పారు. ఈమేరకు వాటిని తొలగించారు. దీంతో విగ్రహంపై యాదవ సంఘాల అభ్యంతరాలు తొలగిపోయే అవకాశముంది. మార్పుల నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేస్తుందని విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న అంశపై ఉత్కంఠ రేపుతోంది.  మరోవైపు యథావిథిగా ఈ నెల 28న విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్, సినీ ప్రముఖులు, ఎన్నారైలు హాజరవుతున్నారు.

Ntr Statue Khammam

Ntr Statue in Khammam

ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు కలిసి.. రూ. 4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 54 అడుగుల ఎత్తైనా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Follow Us
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?