Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: దేవుడా ఏమిటీ ఘోరం.. పుట్టిన రోజునాడే ఆగిపోయిన చిట్టి గుండె.. 15ఏళ్ల సచిన్‌కు హార్ట్‌ ఎటాక్‌..

సచిన్‌ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. రిజల్ట్స్ లో మంచి మార్కులు రావడంతో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. పండుగ వాతవారణం ఉండాల్సిన ఆ ఇంట్లో అంతలోనే విషాదం నిండింది. గుండెపోటుతో సచిన్‌ మృతి ఆ ఇంటిల్లిపాదిని కలచివేసింది.

Heart Attack: దేవుడా ఏమిటీ ఘోరం.. పుట్టిన రోజునాడే ఆగిపోయిన చిట్టి గుండె.. 15ఏళ్ల సచిన్‌కు హార్ట్‌ ఎటాక్‌..
Heart Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 12:21 PM

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది. యువత హృదయాలను స్ట్రోక్ కబళిస్తోంది.. వారిలో గుండెపోటు రావడం గురించి వదిలేస్తే..యువతలో రావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నా పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు ఆగిపోతున్నది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందడం మరింత ఆందోళనలు రేకెత్తిస్తోంది.

చిన్న వయసులోనే హార్ట్‌ ఎటాక్‌లు..టీనేజర్లూ ప్రాణాలు కోల్పోతున్నారు..బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌ జరుపుకుందామనుకున్న సచిన్‌ను మృత్యువు గుండెపోటు రూపంలో మింగేసింది. కొమురంభీం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌కు చెందిన సచిన్‌ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. రిజల్ట్స్ లో మంచి మార్కులు రావడంతో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. పండుగ వాతవారణం ఉండాల్సిన ఆ ఇంట్లో అంతలోనే విషాదం నిండింది. గుండెపోటుతో సచిన్‌ మృతి ఆ ఇంటిల్లిపాదిని కలచివేసింది. కన్న కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

తెల్లవారితే బర్త్‌ డే వేడుకలు కానీ ఇంతలోనే సచిన్‌ మరణం తట్టుకోలేకపోతున్నారు..పదహారేళ్లు కూడా నిండని సచిన్‌ గుండెనొప్పితో హఠాత్తుగా లోకం విడిచి వెళ్లడం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు..బిడ్డపై పడి ఆ తల్లీ గుండెలు పగిలేలా రోదిస్తోంది..విగతజీవిలా పడి ఉన్న సచిన్‌ చేయి పట్టుకుని కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యాలు స్థానికుల్ని కలిచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..