Viveka Murder Case: విచారణకు హాజరు కావాల్సిందే.. ఎంపీ అవినాష్ విజ్ఞప్తి లేఖను తిరస్కరించిన సీబీఐ..

తల్లి అనారోగ్యంతో విచారణకు హాజరుకాలేనన్న ఎంపీ అవినాష్‌. అవినాష్ విఙ్ఞప్తిని తిరస్కరించింది సీబీఐ. ఈనెల 16న విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ సమయం కోరారు అవినాష్. అవినాష్ విఙ్ఞప్తికి అనుమతించి ఇవాళ విచారణకు పిలిచింది సీబీఐ.

Viveka Murder Case: విచారణకు హాజరు కావాల్సిందే.. ఎంపీ అవినాష్ విజ్ఞప్తి లేఖను తిరస్కరించిన సీబీఐ..
Avinash Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: May 19, 2023 | 12:30 PM

మాజీ మంత్రి మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇవాళ విచారణకు హాజరుకాలేదు. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ లిఖిత పూర్వకంగా సమాచారాన్ని న్యాయవాదుల ద్వారా సీబీఐ కార్యాలయానికి పంపించారు. తన తల్లికి అనారోగ్యకారణాల ద్వారా ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్‌ పేర్కొన్నారు. దీనిపై సీబీఐ అధికారులు స్పందించారు. తల్లి అనారోగ్యంతో విచారణకు హాజరుకాలేనన్న ఎంపీ అవినాష్‌ అవినాష్ విఙ్ఞప్తిని తిరస్కరించింది సీబీఐ. ఈనెల 16న విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ సమయం కోరారు అవినాష్. అవినాష్ విఙ్ఞప్తికి అనుమతించి ఇవాళ విచారణకు పిలిచింది సీబీఐ. ఇవాళ కూడా హాజరుకాకపోవడంతో సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఆసక్తి నెలకొంది. సీబీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి వచ్చే అవకాశాలు ఉండటంతో సీబీఐ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివేకా హత్య, ఆధారాలు మాయంపై అవినాష్‌ను విచారించే ఛాన్స్ ఉంది. వివేకా హత్య కేసులో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్ చేసింది సీబీఐ. 3రోజుల క్రితం అవినాష్‌ అనుచరులను విచారించిన సీబీఐ.. తాజాగా ఆయనను విచారణకు పలిచింది. అనంతర పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

ఓ వైపు ముందస్తు షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరుకాలేనన్న అవినాష్‌.. ఆ మరుసటి రోజే సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అత్యవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు వివేకాహత్య కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యారు అవినాష్ అనుచరులు. నాగేళ్ల విశ్వేశ్వర రెడ్డితో పాటు వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. హత్య జరిగిన రోజు ఈ ముగ్గురు ఉదయ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్టు సీబీఐ నిర్ధారించింది. రకరకాల పరిణామాలతో ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకాలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం