Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌ వరకు పొడిగింపు..

పాలమూరు రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నం-కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్లు 12861, 12862 ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ మహబూబ్‌నగర్ వరకు పొడిగించింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌ వరకు పొడిగింపు..
Visakhapatnam Kacheguda Express
Follow us
Sanjay Kasula

|

Updated on: May 19, 2023 | 1:57 PM

పాలమూరు, జడ్చర్ల, షాద్‌నగర్‌,శంషాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నం-కాచిగూడల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు(నం.12862/12861)ను రైల్వేశాఖ మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించింది. ఈ నిర్ణయం మే 20 నుంచి అమలులోకి వస్తుంది. కాచిగూడ తర్వాత ఈ రైలు శంషాబాద్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను విడదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను మే 20 నుంచి మహబూబ్‌నగర్ వరకు పొడిగించింది. విశాఖపట్నం-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లు 12861 మరియు 12862లను పొడిగించినట్లు వాల్టెయిర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్‌కు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

రైలు 12861 విశాఖపట్నంలో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఇది కాచిగూడలో ఉదయం 6:55 గంటలకు బయలుదేరి 9:20 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది.

రైలు 12862 మహబూబ్‌నగర్ నుండి సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి 6:10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది, కాచిగూడ నుండి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

కాచిగూడ నుంచి బయలుదేరిన తర్వాత జడ్చర్ల, కాజీపేట, ఉమ్దానగర్, షాద్‌నగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం