AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతల క్యూ.. ఈరోజు అమిత్‌షాతో భేటీకానున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం. వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి తీసుకురావడం అనే అంశంపైనే బీజేపీ పెద్దలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు.

BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతల క్యూ.. ఈరోజు అమిత్‌షాతో భేటీకానున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Konda Vishweshwar Reddy
Sanjay Kasula
|

Updated on: May 19, 2023 | 2:34 PM

Share

కర్నాటక తీర్పు తర్వాత దేశమంతటా దిగాలుపడిపోయింది బీజేపీ. ముఖ్యంగా తెలంగాణాలో కన్నడ ఎఫెక్ట్ బలంగా ఉండే ఛాన్సుంది. బండి సంజయ్ నేతృత్వంలో కేసీఆర్ టార్గెట్‌గా దూసుకుపోతున్న టీ-బీజేపీ ఈ ప్రభావం పడకుండా ప్లాన్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీబాట పడుతున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్‌, రాజగోపాల్‌, బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి రాగా.. ఇప్పుడు తాజాగా మరికొందరు బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ అమిత్‌షాతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ కానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్‌‌ తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలను కలవనున్నారనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ నేతలను కలిసొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బీజేపీలో వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

ఘర్‌ వాపసీ అంశంపై కూడా కీలక చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు అప్రమత్తమై వ్యూహరచనపై దృష్టి సారిస్తున్నాయి. ఇరు పార్టీలు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాయి. పార్టీ బలోపేతం దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన నాయకులు కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు.

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటలరాజేందర్‌ రెండు రోజుల కిందట ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, పార్టీ పరిస్థితుల గురించి వివరించినట్లు సమాచారం. ప్రత్యేకించి పార్టీలో కొత్తగా చేరికలు, ముఖ్యనాయకుల పనితీరు, కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఈటల తన అభిప్రాయాలను గట్టిగానే వినిపించినట్లు తెలుస్తోంది.

అయితే, బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటలరాజేందర్‌ తిరిగి వచ్చిన తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అమిత్ షాను కలవడం వెనుక మతలబ్ అంటనే కోణంలో రాజకీయ కథనాలు సాగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం