తమిళనాడులో మంత్రి రోజా Vs రజినీకాంత్ ఫ్యాన్స్‌ వార్.. రోజా చేసిన పనికి ఫైర్ అవుతోన్న అభిమానులు..

ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు నటుడు రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఆర్ తనయుడు బాలకృష్ణ, అల్లుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ వైభవం గురించి మాట్లాడిన రజనీకాంత్,..

తమిళనాడులో మంత్రి రోజా Vs రజినీకాంత్ ఫ్యాన్స్‌ వార్..  రోజా చేసిన పనికి ఫైర్ అవుతోన్న అభిమానులు..
Rojas Reaction Question Raj
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 11:12 AM

తమిళనాడులో మంత్రి రోజా Vs రజినీకాంత్ ఫ్యాన్స్‌ వార్ నడుస్తోంది. రజినీకాంత్‌ విషయంలో రోజా పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌పై రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. రజినీకాంత్‌పై ప్రశ్నఅడిగితే రోజా వెక్కిరించారని ఆయన ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మంత్రి రోజా చూపిన హావభావాలకు క్షమాపణ చెప్పాలని రజినీకాంత్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని తిరుచెందూర్‌లో జరిగింది. అక్కడి మురగన్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్లిన రోజా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గతంలో ఏపీకి వచ్చిన రజినీకాంత్, అన్నగారిని ప్రశంశించారు. అలాగే చంద్రబాబునూ ఆకాశానికెత్తారు. ఆ ప్రశంసలపై వైసీపీ మండిపడింది. చంద్రబాబు విజనరీ ఉన్న నేత అంటూ రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. తమిళనాడులో అడుగుపెట్టిన రోజాను అక్కడి మీడియా కూడా ఇదే తరహా ప్రశ్నలు వేసింది. అందుకు రోజా మాత్రం విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. రజనీ గురించి అడిగిన ప్రశ్నకు రోజా సమాధానం ఇవ్వకుండా, ప్రశ్న నుండి తప్పించుకుంటూ రియాక్షన్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు నటుడు రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఆర్ తనయుడు బాలకృష్ణ, అల్లుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ వైభవం గురించి మాట్లాడిన రజనీకాంత్, చంద్రబాబు నాయుడు-బాలకృష్ణ వైభవం గురించి కూడా మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, రజనీకాంత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభావవంతమైన గుర్తింపు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని జీరో అంటారని నటి, మంత్రి రోజా స్వయంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో రోజా హావభావాలే తలైవా ఫ్యాన్స్‌కి కోపాన్ని తెప్పించాయి. ఇదెక్కడి వ్యంగ్యం అంటూ మండిపడుతున్నారు ఆయన ఫ్యాన్స్‌. మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.. !

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..