Volunteer ki Vandanam: వాలంటీర్లకు వందనం.. వలంటీర్లు సేవలకు గుర్తింపుగా కార్యక్రమం..(లైవ్)

Volunteer ki Vandanam: వాలంటీర్లకు వందనం.. వలంటీర్లు సేవలకు గుర్తింపుగా కార్యక్రమం..(లైవ్)

Anil kumar poka

|

Updated on: May 19, 2023 | 10:40 AM

వలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైసీపీ ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారు.

వలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైసీపీ ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సేవా భావంతో సేవలందిస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రోత్సాహకంగా సత్కారం చేస్తూ వస్తోంది.అవినీతికి తావు లేకుండా, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు. నేడు అందిస్తున్న ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం ఖర్చుచేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?

Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..