Viveka Murder Case: తల్లి అనారోగ్యంతో పులివెందులకు బయల్దేరిన అవినాష్.. సీబీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..
తల్లి అనారోగ్యంతో ఉందంటూ సమాచారం రావడంతో ఆయన పులివెందులకు బయల్దేరారు. ఈనెల 16న విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ సమయం కోరారు. అవినాష్ విఙ్ఞప్తికి అనుమతించి ఇవాళ విచారణకు పిలిచింది సీబీఐ.

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ కూడా సీబీఐ విచారణకు హాజరు కాలేదు. తల్లి అనారోగ్యంతో ఉందంటూ సమాచారం రావడంతో ఆయన పులివెందులకు బయల్దేరారు. పులివెందులలోని ఈ సి గంగిరెడ్డి ఆసుపత్రిలో ఎంపి అవినాష్ తల్లి చికిత్స కోసం చేరినట్లుగా సమాచారం. అయితే ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ సమయం కోరారు. అడ్వాకెట్ ద్వారా లెటర్ పంపించారు అవినాష్. తన తల్లికి అనారోగ్యంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. అవినాష్ అవినాష్ విఙ్ఞప్తికి అనుమతించిందా..? లేదా తెలియాల్సి ఉంది. విచారణకు మరోరోజు పిలిచే అవకాశం ఉంది. ఇవాళ కూడా హాజరుకాకపోవడంతో సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సీబీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకావల్సి ఉంది. వైఎస్ వివేకా హత్య, ఆధారాలు మాయంపై ప్రధానంగా ప్రశ్నిస్తారని అంతా అనుకున్నారు. అవినాశ్ విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేదానిపై వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి.
ఈనెల 16న సీబీఐ అధికారుల ఎదుట విచారణకు అవినాష్ హాజరుకావాల్సి ఉంది. తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని.. నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూనే.. శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. పులివెందులలోని ఆయన ఇంటికివెళ్లి, అక్కడున్న వారికి నోటీసులిచ్చారు.
ఓ వైపు ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనన్న అవినాష్.. ఆ మరుసటి రోజే సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అత్యవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు వివేకాహత్య కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యారు అవినాష్ అనుచరులు. నాగేళ్ల విశ్వేశ్వర రెడ్డితో పాటు వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. హత్య జరిగిన రోజు ఈ ముగ్గురు ఉదయ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్టు సీబీఐ నిర్ధారించింది. రకరకాల పరిణామాలతో ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకాలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం