Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stray Dogs Attack: హన్మకొండ జిల్లాలో దారుణం.. వీధి కుక్కల మూకుమ్మడి దాడిలో ఏడేళ్ల బాలుడి బలి

వీధి కుక్కలకు మరో బాలుడు బలయ్యాడు. హన్మకొండ జిల్లాలో వీధి కుక్కల మూకుమ్మడి దాడిలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Stray Dogs Attack: హన్మకొండ జిల్లాలో దారుణం.. వీధి కుక్కల మూకుమ్మడి దాడిలో ఏడేళ్ల బాలుడి బలి
Stray Dogs
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2023 | 11:42 AM

మొన్న అంబర్‌ పేట్..నిన్న మెదక్, శ్రీకాకుళం..ఇప్పుడు హన్మకొండ. ఏరియా మారుతోంది తప్ప కుక్కల బెడద మాత్రం కంటిన్యూ అవుతోంది. ప్రతీచోటా పసిబిడ్డల పాలిట కుక్కలే శాపంగా మారుతున్నాయి. అవే యమదూతల్లా మారి చంపేస్తున్నాయి..! ఏడేళ్ల బాలుడిని.. క్రూరమృగాన్ని తలపించేలా ఉన్న ఓ కుక్క మెడ, తల పట్టి పీక్కుతినేసింది. ఆ బాధ తాళలేక బాలుడు చోటూ మృతి చెందిన ఘటన హన్మకొండజిల్లాలోని కాజీపేటలో చోటుచేసుకుంది ఈ విషాద ఘటన. మానవత్వం ఉన్న మనుషులందరినీ కలిచివేస్తోంది. ఈ పాపం ఎవరిది..? బాలుడు చోటూ మృతికి బాధ్యులెవరు..? కన్నవారిని కడుపుకోతను ఆపేదెవరు? వీధి కుక్కలకు మరో బాలుడు బలయ్యాడు. హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధి కుక్కల మూకుమ్మడి దాడిలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు, కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  కాగా వీధి కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడు పేరు చోటూ. యూపీ నుంచి బతుకుదేరువు కోసం వచ్చి కాజిపేట ప్రాంతంలో నివాసముంటున్నారు పిల్లాడి తల్లిదండ్రులు.

పొట్టకూటి కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి నిన్ననే కాజీపేట ప్రాంతానికి వచ్చింది బాలుడు చోటూ కుటుంబం. రోడ్డు పక్క చెట్ల కింద నివాసం ఉంటున్న చోటూ తల్లిదండ్రులు ఉంగరాలు అమ్ముకొని జీవిస్తున్నారు. వాళ్లు ఉంటున్న ప్రాంతంలోనే ఆడుకుంటున్న చోటూపై ఊరకుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మెడ భాగంలో నరాలను కొరికిపారేసింది. బాలుడు గట్టిగా అరిచేలోపే కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. చోటూ అక్క, చెల్లి వచ్చేలోపే తన పని కానిచ్చేసి అక్కడి నుంచి పారిపోయింది కుక్క. కొనప్రాణాలతో ఉన్న చోటూను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. చోటూ ఇక లేడన్న విషయాన్ని జీర్జించుకోలేని అతని అక్క, చెల్లి , తల్లిదండ్రులు బోరున విలపించారు.ఈ హృదయ విదాకర దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి. బాలుడు చోటూ కుటుంబాన్ని మేయర్‌ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పరామర్శించారు. బాలుడు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు