Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: ఎయిర్‌ కండీషనర్‌ రంగు ఎందుకు తెల్లగానే ఉంటుంది..? దీని వెనుక శాస్త్రీయ కారణం తెలుసా..?

మొదట్లో AC పరిమాణం చాలా పెద్దది. ఇప్పుడు సైజు, ఫీచర్లను బట్టి స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, పోర్టబుల్ ఏసీ ఇలా ఎన్నో రకాల ఏసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు కూడా ACని ఉపయోగిస్తున్నట్టయితే,..AC తెల్లగానే ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ సందేహం మీకూ కలిగే ఉంటుంది..! అదేందుకో ఇక్కడ తెలుసుకుందాం...

Air Conditioner: ఎయిర్‌ కండీషనర్‌ రంగు ఎందుకు తెల్లగానే ఉంటుంది..? దీని వెనుక శాస్త్రీయ కారణం తెలుసా..?
Representative Image
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 12:02 PM

మే నెలలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భానుడి భగభగలతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలెత్తిపోతుంటారు. ఇంట్లో కూడా వేడి, ఉక్కపోతను భరించలేక ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలను ఉపయోగిస్తారు. గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎయిర్ కండీషనర్ల వాడకం బాగా పెరిగింది. ఈరోజుల్లో చాలా ఇళ్లలో ఏసీ కనిపిస్తోంది. ఆఫీసుల్లోనూ ఎక్కడికక్కడ ఎయిర్ కండీషనర్లే ఉంటున్నాయి. ఇది కాకుండా, ఎండల తీవ్రత కారణంగా కేఫ్‌లు, హోటళ్లు కూడా ఎయిర్ కండిషన్ లేకుండా పనిచేయటం లేదు. ఇప్పుడు ఏసీ లోకల్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, మొదట్లో AC పరిమాణం చాలా పెద్దది. ఇప్పుడు సైజు, ఫీచర్లను బట్టి స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, పోర్టబుల్ ఏసీ ఇలా ఎన్నో రకాల ఏసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు కూడా ACని ఉపయోగిస్తున్నట్టయితే,..AC మెషీన్ ఎప్పుడూ తెల్లగానే ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ సందేహం మీకూ కలిగే ఉంటుంది..! అదేందుకో ఇక్కడ తెలుసుకుందాం…

ఎయిర్ కండీషనర్ రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది?

ఎయిర్ కండీషనర్ నుండి చల్లని గాలి వస్తోంది. ఇల్లు, గదిలోని వాతావరణాన్ని చల్లబరచడానికి AC ఉపయోగించబడుతుంది. ఏసీ మెషిన్ నిరంతరంగా పనిచేస్తుంటే, దానిపై లోడ్ పడుతుంది. ఈ పరికరం హీటెక్కినప్పుడు పాడైపోయే అవకాశం ఉంటుంది.. వేసవిలో సూర్య కిరణాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కిరణాలు తెలుపు రంగు వైపు తక్కువగా శోషించబడతాయి. సూర్యకిరణాలు AC మెషీన్‌కు చేరకుండా, వేడెక్కకుండా నిరోధించడానికి ఏసీలు తెలుపు లేదంటే, ఇతర లైట్ షేడ్స్‌లో ఉంటుంది. వేసవిలో వేడిని తట్టుకోవడానికి మనం తెల్లటి దుస్తులు ధరించినట్లే అదే కారణంతో ఏసీలకు తెల్లటి రంగు వేస్తారు.

విండో AC ఒకే యూనిట్‌లో పనిచేస్తుంది. ఇంట్లో లేదా గదిలోని కిటికీ దగ్గర ఈ ఏసీ అమర్చబడి ఉంటుంది. ఈ ఏసీ రంగులో ఎలాంటి ఆప్షన్ లేదు. ఇది తెలుపు రంగులో మాత్రమే లభిస్తుంది. స్ప్లిట్ ఏసీని రెండు యూనిట్లుగా విభజించారు. ఇంటి బయట ఉండే ఈ ఏసీ భాగం తెలుపు రంగులో ఉంటుంది. వినియోగదారులు ఇండోర్ స్ప్లిట్ AC మెషీన్ రంగులో కావాల్సిన కలర్‌ని ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..