ATM పిన్ నంబర్‌ నాలుగు అంకెలు మాత్రమే ఎందుకుంటుంది..? దాని వెనుక అసలు కారణం ఇదేనట..!

స్కాటిష్ శాస్త్రవేత్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్ 1969లో ATM యంత్రాన్ని కనుగొన్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఏటీఎంను కనిపెట్టిన వ్యక్తి భారతదేశంలోనే పుట్టడం.. అడ్రియన్ షెపర్డ్ బారన్ ఈశాన్య భారతదేశంలోని ప్రసిద్ధ నగరంలో జన్మించారు. ఇక 53 ఏళ్ల వయసులో ఆయన పుట్టిన..

ATM పిన్ నంబర్‌ నాలుగు అంకెలు మాత్రమే ఎందుకుంటుంది..? దాని వెనుక అసలు కారణం ఇదేనట..!
Atm
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 1:07 PM

ఒకప్పుడు డబ్బులను డ్రా చెయ్యాలంటే బ్యాంక్ కు వెళ్ళి ఒక ఫామ్ ఫిల్‌ చేయాల్సి వచ్చేది. ఆ ఫామ్‌ చేతిలో పట్టుకుని బ్యాంక్ ఉద్యోగి దగ్గరకు వెళ్ళి దాన్ని ఇచ్చి లైన్ లో నిలబడి వేచి చూస్తూ డబ్బులను తీసుకోవాల్సి వచ్చేది.. తీసుకోవడానికి బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఏటీఎం సదుపాయంతో డబ్బును సులువుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు తమ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా బ్యాంకు ఏటీఎం మెషిన్‌కు వెళ్లి సులభంగా డబ్బు డ్రా చేసుకుంటున్నారు. కానీ, ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలంటే నాలుగు అంకెల పిన్ కోడ్ అవసరం. ATM మెషీన్‌లో ATM కార్డ్‌ని చొప్పించిన తర్వాత, నాలుగు అంకెల పిన్ కోడ్‌ను ఎంటర్‌ చేస్తే గానీ, డబ్బు డ్రా చేసుకోగలుగుతాము.

స్కాటిష్ శాస్త్రవేత్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్ 1969లో ATM యంత్రాన్ని కనుగొన్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఏటీఎంను కనిపెట్టిన వ్యక్తి భారతదేశంలోనే పుట్టడం.. అడ్రియన్ షెపర్డ్ బారన్ ఈశాన్య భారతదేశంలోని షిల్లాంగ్ నగరంలో జన్మించాడు. అతని ఆవిష్కరణ నేడు ప్రజలను పెద్ద సమస్య నుండి రక్షించింది. ఇకపోతే 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా అడ్రియన్ షెపర్డ్ జన్మించిన మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో తొలిసారిగా మెషిన్‌ను ఏర్పాటు చేశారు. అయితే, మొదట్లో ఏటీఎం పిన్ 6 నంబర్ల తో ఉండేది. కానీ, ఈ విధానం వల్ల చాలా మంది పిన్ నంబర్ మరచిపోవడం జరుగుతుండేది. ఈ విషయంలో ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు రావడంతో అంతా సులువుగా గుర్తుంచుకునేందుకు వీలుగా ఉండేలా నాలుగు నంబర్లకు కుదించారు. అయితే ఆరు నెంబర్లు ఉండడం వల్ల గుర్తుంచుకోవడం ఇబ్బంది అయినా కూడా ఈ నంబర్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టం.

ATM నాలుగు అంకెల పిన్‌కోడ్ 0000, 9999 మధ్య ఉంటుంది. ఇది 10000 వరకు వివిధ పిన్ నంబర్‌లతో సెట్‌ చేసుకోవచ్చు. ఇందులో 20 శాతం మంది  ఏటీఎం పిన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా, నాలుగు అంకెల పిన్ కంటే ఆరు అంకెల పిన్ సురక్షితమైనదిగా చెబుతారు. ఇకపోతే ఈ వ్యక్తి మన భారతీయుడే కావడం విశేషం.. 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా అడ్రియన్ షెపర్డ్ జన్మించిన మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో తొలిసారిగా మెషిన్‌ను ఏర్పాటు చేశారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..