Andhra Pradesh: నా నమ్మకమే వాలంటీర్లు.. వాళ్లే ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్లు- సీఎం జగన్

ప్రభుత్వంపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో అంతా చూస్తున్నారని, మంచి చేస్తున్న పేదల ప్రభుత్వం మీద గిట్టని వారి తప్పుడు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించే సత్య సారథులు, సత్య సాయుథులు వాలంటీర్లు మాత్రమేనన్నారు.

Andhra Pradesh: నా నమ్మకమే వాలంటీర్లు.. వాళ్లే ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్లు- సీఎం జగన్
Volunteer Ki Vandanam
Follow us
Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: May 19, 2023 | 1:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సారథులు వాలంటీర్లు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన మూడో ఏడాది ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… వాలంటీర్ల వ్యవస్థ ఓ మహాసైన్యమన్నారు. జగన్ పెట్టుకున్న నమ్మకమే వాలంటీర్లు అన్నారు. ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్న వ్యవస్థను.. గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా ?అని ప్రజల్ని ప్రశ్నించారు. 64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులని వాలంటీర్లను కొనియాడారు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ల ద్వారా ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం వాలంటీర్ల నిర్వహిస్తున్నారని చెప్పారు.

గత ప్రభుత్వంలో జన్మభూమి అరాచకాలు చూశారన్నారు. లంచాలు, అరాచకాలు లేని తులసి మొక్కలాంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు వాలంటీర్లు అని… 25రకాల సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లు అన్నారు. ఇంత మంచి జరుగుతున్నా ఓర్వలేక కడుపు మంటతో… మంచి చేసిన చరిత్ర లేనివాళ్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. నిజాలు చెప్పగలిగే సత్య సాయుధులు వాలంటీర్లన్నారు.  ప్రతి ఇంటికి నేరుగా వెళ్లగలిగే వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రతి గడప వద్దకు తీసుకెళ్లగలిగినందున, ప్రతి ఇంట్లో మంచి జరిగిందో లేదో ధైర్యంగా అడిగే హక్కు వాలంటీర్లతోనే సాధ్యమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రతి గడపలో మంచి తప్ప చెడు ఎక్కడా చేయలేదన్నారు.

రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా డిబిటి నాన్‌ డిబిటి పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్ల రుపాయల విలువైన మంచిని నాలుగేళ్లలో ప్రజలకు అందించినట్లు సిఎం జగన్ చెప్పారు. ప్రభుత్వంపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో అంతా చూస్తున్నారని, మంచి చేస్తున్న పేదల ప్రభుత్వం మీద గిట్టని వారి తప్పుడు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించే సత్య సారథులు, సత్య సాయుథులు వాలంటీర్లు మాత్రమేనన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారని, వాలంటీర్లు అల్లరి మూకలని, అది మూటలు మూసే ఉద్యోగమని, అధికారం వస్తే వాలంటీర్లను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామన్నారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

వాలంటీర్ వ్యవస్థ మీద డజను జెలుసిల్ మాత్రలు వేసినా తగ్గనంత కడుపు మంట ప్రత్యర్థులకు ఉందని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా అన్ని పథకాల అమలు వాలంటీర్ల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాలు చూశారని, వివక్ష, లంచాలు చూశామని వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన తులసిమొక్కల్లాంటి వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందన్నారు. 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్‌ అంబాసిడర్లుగా వాలంటీర్లు నిలిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా సేవా భావంతో ప్రజలకు మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..