AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్​ మరిన్ని అదిరిపోయే ఫీచర్లతో Noise స్మార్ట్​వాచ్​.. ధర ఇంత తక్కువా

స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఆరోగ్య వివరాలను తెలుసుకోవడం, రోజువారీ ఫిట్‌నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయడం వంటి అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్ బ్రాండ్ Noise బడ్జెట్ ధరలో Icon 2 Gen 2 స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్​ మరిన్ని అదిరిపోయే ఫీచర్లతో Noise స్మార్ట్​వాచ్​.. ధర ఇంత తక్కువా
Noise Icon 2 Gen 2 Smartwatch
Nikhil
|

Updated on: Nov 02, 2026 | 6:30 AM

Share

పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు Icon 2 Gen 2 వాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రూ.1,299 ధరలోనే ఇన్ని సదుపాయాలు లభించడం బడ్జెట్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకునేవారికి ఆసక్తికరమైన విషయం. రోజువారీ వినియోగానికి అనువైన డిజైన్‌తో పాటు 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా ఇందులో ఉంది. మరి ఈ వాచ్‌లోని పూర్తి ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.

బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్

Noise Icon 2 Gen 2 స్మార్ట్‌వాచ్‌లో 1.81 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీనివల్ల నోటిఫికేషన్లు, అక్షరాలు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్ వాచ్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అలాగే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో బయట ఎండలోనూ స్క్రీన్‌ను సులభంగా చూడవచ్చు.

ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. హెల్త్ ట్రాకింగ్ కోసం హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్ అందించారు. వివిధ స్పోర్ట్స్ మోడ్‌లు ఫిట్‌నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి.

ధర ఎంత?

బ్యాటరీ విషయానికి వస్తే, సాధారణ వినియోగంలో కొన్ని రోజుల పాటు బ్యాకప్ అందించేలా ఈ వాచ్‌ను రూపొందించారు. అయితే వాస్తవ బ్యాటరీ పనితీరు వినియోగించే ఫీచర్లు, కాలింగ్ సమయం ఆధారంగా మారుతుంది. వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటంతో చెమట, వర్షపు నీటి నుంచి రక్షణ లభిస్తుంది. క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్ ద్వారా నచ్చిన డిజైన్‌ను ఎంచుకుని వాచ్ రూపాన్ని మార్చుకోవచ్చు.

ధర విషయానికి వస్తే Noise Icon 2 Gen 2 స్మార్ట్‌వాచ్‌ను రూ.1,299కు అందిస్తున్నారు. ఈ ధరలో పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు లభించడం ప్రత్యేకత. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్‌తో పాటు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నవారు ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు.

Follow Us