AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడో తెలుసుకోండి..

హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల మీదుగా ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి. బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

Hyderabad: వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడో తెలుసుకోండి..
Hyderabad Traffic Restrictions
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 6:35 PM

Share

హైదరాబాద్ నగరంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు నిర్వహించనున్న పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు అవసరాన్ని బట్టి ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. పాదయాత్ర నేపథ్యంలో బషీర్‌బాగ్, లిబర్టీ, రవీంద్రభారతి, బీజేఆర్ విగ్రహం, ఎంజే మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, జీపీఓ, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు

ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లిస్తారు. తాజ్ ఐలాండ్ నుంచి ఓల్డ్ ఏబీసీ లేన్, యూసుఫ్ అండ్ కంపెనీ, ట్రూప్ బజార్ మీదుగా బ్యాంక్ స్ట్రీట్ వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. హిమాయత్‌నగర్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లిబర్టీ వద్ద ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. రాజారెడ్డి మార్గ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు.

ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి నుంచి చాపెల్ రోడ్, సుజాత స్కూల్ జంక్షన్, ఎస్‌బీఐ రోడ్ వైపు వెళ్లే వాహనాలను చాపెల్ రోడ్ టీ జంక్షన్ వద్ద నాంపల్లి, ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు మళ్లిస్తారు. కింగ్‌కోఠి జంక్షన్ నుంచి తాజ్ మహల్ హోటల్ జంక్షన్, అబిడ్స్ వైపు వెళ్లే వాహనాలను బషీర్‌బాగ్, బొగ్గులకుంట వైపు మళ్లిస్తారు. బొగ్గులకుంట జంక్షన్ నుంచి బాటా టీ జంక్షన్, అబిడ్స్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. కింగ్‌కోఠి, మయూరి పాన్ షాప్ వైపు మళ్లిస్తారు. స్టాన్లీ కాలేజ్, సుజాత స్కూల్ వైపు వాహనాలను అనుమతించరు. రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి నాంపల్లి ఎక్స్ రోడ్స్, ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు. జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు.

అవాయిడ్ చేయాల్సిన జంక్షన్లు

నవంబర్ 2న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనదారులు లిబర్టీ, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, ఏఆర్ పెట్రోల్ పంప్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి, జీపీఓ, నాంపల్లి టీ జంక్షన్, తాజ్ ఐలాండ్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్ ప్రాంతాలను వీలైనంత వరకు నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

పాదయాత్ర నేపథ్యంలో పలు ప్రధాన రహదారుల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయి. పీటీఐ నుంచి రవీంద్రభారతి, కార్ఖానా నుంచి రవీంద్రభారతి, కట్టమైసమ్మ నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి లిబర్టీ, స్మశానవాటిక జంక్షన్ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్ నుంచి బ్యాంక్ స్ట్రీట్, రామ్‌కోఠి నుంచి అబిడ్స్, చాదర్‌ఘాట్ నుంచి ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ నుంచి ఎంజే మార్కెట్ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. అలాగే ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం నుంచి డీఎంహెచ్‌ఎస్, భూలక్ష్మి టెంపుల్ నుంచి ఎంజే మార్కెట్, బోయిగూడ ఖమాన్ నుంచి మలకుంట టీ జంక్షన్, ఎంజే మార్కెట్ నుంచి రవీంద్రభారతి, గోకుల్ నగర్ నుంచి నాంపల్లి ఎక్స్ రోడ్స్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. రసూల్‌పురా జంక్షన్ నుంచి రాణిగంజ్, పంజాగుట్ట ఎక్స్ రోడ్స్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ మార్గాల్లో వెళ్లే వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఆర్టీసీ బస్సుల రూట్లలో మార్పులు

ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్లోనూ మార్పులు చేయనున్నారు. రవీంద్రభారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ వైపు వెళ్లే బస్సులను తాజ్ ఐలాండ్ వైపు మళ్లిస్తారు. అప్పర్ ట్యాంక్‌బండ్, ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం నుంచి లిబర్టీ వైపు వచ్చే బస్సులను తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు. వివిధ జిల్లాల నుంచి రాణిగంజ్, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే బస్సులను సీటీఓ జంక్షన్ వద్ద రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తారు.

రైల్వే ప్రయాణికులు, విమాన ప్రయాణికులకు కీలక సూచన

నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు, రద్దీ కారణంగా ప్రయాణానికి అదనపు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. తమ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ముందుగానే బయలుదేరి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. అత్యవసర వాహనాల సహాయం కోసం, ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9010203626 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Follow Us