AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుకూలంగా గ్రహబలం.. ఈ రాశులవారికి మంచి రోజులొచ్చాయ్.. సోమవారం దినఫలాలు ఇదిగో..

Horoscope Today: నవంబర్ 2, 2026 సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, వివాహ ప్రయత్నాల విషయంలో గ్రహబలం ఎలా ఉండబోతోంది? నేటి రాశిఫలాలు తెలుసుకోండి..

అనుకూలంగా గ్రహబలం.. ఈ రాశులవారికి మంచి రోజులొచ్చాయ్.. సోమవారం దినఫలాలు ఇదిగో..
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 02, 2026 | 6:39 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 2, 2026): మేషం రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. సోమవారం మేషం రాశి మొదలుకొని.. మీనం రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు గ్రహబలం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలతో పాటు, ఉద్యోగపరంగా రావలసిన బకాయిలు కూడా చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉన్నా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. సొంత పనుల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు ఈ సమయంలో తమకు అందిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. డబ్బుకు సంబంధిం చిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. కొత్త అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కొద్దిగా బయటపడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

గ్రహ బలం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీ ప్రాబల్యం బాగా పెరుగుతుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న సొమ్మును కూడా గట్టి ప్రయత్నంతో రాబట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగి పోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఆశించిన మనశ్శాంతి లభిస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ, ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ప్రయత్నాలకు, నిర్ణయాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సమాజంలోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులకు బాగా అండగా నిలబడతారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేపడ తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గుర్తింపు ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పెళ్లి ప్రయ త్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. తల్లితండ్రుల నుంచి వార సత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.

Follow Us