AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి.. భారీ జరిమానా విధింపు

స్వయం ప్రకటిత గాడ్‌మ్యాన్, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి అయిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. పాట్నా పర్యటనలో..

ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి.. భారీ జరిమానా విధింపు
Dhirendra Shastri
Srilakshmi C
|

Updated on: May 19, 2023 | 5:54 PM

Share

స్వయం ప్రకటిత బాబా, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి అయిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. పాట్నా పర్యటనలో ఉన్న ఆయన ఇటీవల సీటు బెల్డ్ లేకుండా ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు.

కాగా బాగేశ్వర్ బాబా మే 13న పాట్నాకు వచ్చారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా బాగేశ్వర్ బాబా, బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీతో కలిసి అదే రోజు ఎయిర్‌ పోర్టు నుంచి హోటల్‌కు వెళ్తున్న సమయంలో వారు సీటు బెల్టు ధరించనందుకు రూ.1,000 చలనా జారీ చేసినట్టు పాట్నా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు తివారీ, బాగేశ్వర్ బాబాలకు ఈ మేరకు చలానా వేసినట్లు పాట్న ట్రాఫిక్‌ పోలీస్‌ ఎస్పీ పురాన్‌ కుమార్ ఝా తెలిపారు. 90 రోజుల్లో చలానా మొత్తం చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. పాట్నాలో పర్యటించిన బాగేశ్వర్ బాబా దర్శనార్ధం తరేత్ పాలీ మఠానికి పెద్ద సంఖ్యలో ఆయన భక్తులు తరలి రావడంతో రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం తలెత్తింది. మఠానికి 25 కిలోమీటర్ల పరిధిలో మే 13 నుంచి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో