Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan drugs case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సంచలనం.. షారూక్ ఖాన్ చాట్‌ను బయటపెట్టిన వాంఖడే..

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం చేటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్‌‌ను సేవ్ చేసేందుకు.. షారూఖ్ ఖాన్ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వాట్సాప్ చాట్ బయటపడింది. ఈ కేసులో ఆర్యన్‌ను తప్పించేందుకు రూ. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎన్‌బీ అధికారి సమీర్ వాంఖడే..

Aryan Khan drugs case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సంచలనం.. షారూక్ ఖాన్ చాట్‌ను బయటపెట్టిన వాంఖడే..
Sameer Wankhede
Follow us
Shiva Prajapati

|

Updated on: May 19, 2023 | 8:32 PM

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు దేశమంతా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు అప్పట్లో అంతే రేటింగ్‌ వచ్చింది. అయితే.. కొడుకును విడిపించాలంటూ తండ్రిగా షారూఖ్‌ చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు సమీర్‌ వాంఖడేనే వేడుకున్నారు. ఆర్యన్‌ను సేవ్‌ చేయాలని అడుక్కున్నారు. అన్నీ నేను చూసుకుంటానని.. సమీర్‌ వాంఖడే షారూఖ్‌తో చాట్ చేశారు. ఆ వాట్సప్‌ చాటింగులన్నీ ఇప్పుడు టీవీ9 చేతిలో ఉన్నాయి. కొడుకు కోసం షారూఖ్‌ పడిన తపన తీరు ఆ చాటింగ్స్‌లో కళ్లకు కడుతోంది.

ఆర్యన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చి రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత సమీర్‌ వాంఖడే చిట్టా తెరిచింది. ఆర్యన్‌ను డ్రగ్స్‌ కేసులో ఇరికించకుండా ఉండేందుకు సమీర్‌..షారూఖ్‌ను 25 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌ లంచం కేసునే సమీర్‌పై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

అంతేకాదు. వాంఖడే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ రిపోర్ట్‌..పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు వెళ్లారని సీబీఐ చెబుతోంది. ఐదేళ్లలో 2017 నుంచి 2021 వరకు.. సమీర్ వాంఖడే తన కుటుంబంతో యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. వాంఖడే దగ్గర దాదాపు 20 లక్షలు విలువ చేసే రోలెక్స్‌ వాచ్‌ ఉందని..ముంబయ్‌లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని.. మరోచోట 41 ఎకరాల భూమి ఉన్నట్లు సీబీఐ అధికారులు లెక్క తేల్చారు. ఐదో ఫ్లాట్‌కు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారని చిట్టా మొత్తం బయట పెట్టింది. ఇదే ఇప్పుడు వాంఖమే మెడకు చుట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..