Optical Illusion: చెట్టు కొమ్మల్లో నక్కి ఉన్న క్రూరమృగం.. 8 సెకన్లలో కనిపెడితే మీ బ్రైయిన్ చిరుత కంటే వేగంగా పని చేస్తున్నట్లే..
ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్.. ఇవి చూసేందుకు ఎంత బాగుంటాయో.. అంతకు మించి టిపికల్‌గా ఉంటాయి. పజిల్స్, పెయింటింగ్స్ మాత్రమే కాకుండా.. ప్రకృతి సహజంగా కూడా కొన్ని దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. చూసేందుకు ఒకలా ఉండి..
ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్.. ఇవి చూసేందుకు ఎంత బాగుంటాయో.. అంతకు మించి టిపికల్‌గా ఉంటాయి. పజిల్స్, పెయింటింగ్స్ మాత్రమే కాకుండా.. ప్రకృతి సహజంగా కూడా కొన్ని దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. చూసేందుకు ఒకలా ఉండి.. వాస్తవానికి మరోలా ఉంటుంది. అలా మన కళ్లు గందరగోళానికి గురవుతాయి.
అందుకే.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. అందులోని మర్మం.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. పైగా.. ఆప్టికల్ ఇల్యూజన్స్ వ్యక్తి బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. సహనాన్ని, ఆలోచనా శక్తిని పెంచుతుంది. తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న నేచర్ పజిల్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం. ఆ ఆప్టికల్ ఇల్యూజన్‌కు సరైన ఆన్సర్ చేయాలంటే.. మీలో సహనం వందశాతం ఉండాలి. అంతకు మించి కంటి చూపు మెరుగ్గా ఉండాలి.
జంతువుల జీవనశైలి చాలా భిన్నమైనది. చెట్లు, పుట్టలపైనే జీవిస్తాయి. ఇక క్రూర మృగాలు తమ వేటను అత్యంత చాకచక్యంగా సాగిస్తాయి. తమ కదలికలను ఎదుటి జీవికి తెలియకుండా.. పకడ్బందీగా అడుగులు వేస్తాయి. అందులో చిరుత గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. నక్కి నక్కి మరీ అటాక్ చేస్తుంది. తాజాగా చిరుతకు వేటకు సంబంధించిన ఆప్టికల్ ఇల్యూజన్ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పైన ఇవ్వబడిన ఫోటోలో ఓ చిరుత నక్కి ఉంది. వేట కోసం కాపుకాస్తోంది. మరి ఆ చిరుత ఎక్కడ ఉంది అనేది మీరే చెప్పాలి.
ఈ ఫోటోలో గుబురుగా ఉన్న చెట్టు ఉండగా.. ఆ చెట్టును తనకు అనువుగా మార్చుకుని దాక్కుంది చిరుత. కొంచెం పరిశీలించి చూస్తే ఆ చిరుత ఎక్కడ ఉందో ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఏంటి? ఇంకా దొరకలేదా? అయితే ఆన్సర్ తెలుసుకుందాం. ఫోటోలో గుబురుగా ఉన్న రెండు చెట్లు ఉన్నాయి. అందులో మీకు ఎడమవైపున ఉన్న చెట్టు ఉంది. ఆ చెట్టు చివరన కొమ్మల మధ్య నక్కి ఉంది చిరుత పులి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..