RCB vs SRH: 2 గోల్డెన్ డక్స్.. ఒక్క రన్ లేకుండానే మూడుసార్లు పెవిలియన్‌.. హైదరాబాద్‌పై కోహ్లీ రికార్డ్ ఇదీ..!

ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి చాలా కీలకమైన మ్యాచ్.

RCB vs SRH: 2 గోల్డెన్ డక్స్.. ఒక్క రన్ లేకుండానే మూడుసార్లు పెవిలియన్‌.. హైదరాబాద్‌పై కోహ్లీ రికార్డ్ ఇదీ..!
Virat Kohli
Follow us
Shiva Prajapati

|

Updated on: May 18, 2023 | 2:57 PM

ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి చాలా కీలకమైన మ్యాచ్. అందుకే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. కోహ్లీ అభిమానులంతా అద్భుతమైన ఇన్నింగ్స్ చూడాలని ఆశిస్తున్నారు. అయితే, అంతకన్నా ముందు సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లీ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేసుకుందాం.

ఎస్ఆర్‌హెచ్‌పై కోహ్లీ రికార్డ్స్..

ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన చివరి రెండు ఇన్నింగ్స్‌లలో కోహ్లీ గోల్డెన్ డక్‌(తొలి బంతికే ఔట్) ఔట్ అయ్యాడు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక ఇప్పటి వరకు కోహ్లీ ఎస్ఆర్‌హెచ్‌పై మొత్తం 20 ఇన్నింగ్స్ ఆడాడు. 31.6 సగటుతో 136.8 స్ట్రైక్ రేటుతో 569 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఎస్ఆర్‌హెచ్‌పై కోహ్లీ టాప్ స్కోర్ 93 నాటౌట్. 2013లో ఈ పరుగులు చేశాడు. అదే సమయంలో హైదారాబాద్‌తో ఆడిన 20 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ మొత్తం మూడుసార్లు ఖాతా తెరవకుండా 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక ఈ 20 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 54 ఫోర్లు, 21 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్ 2023లో సైన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ ఐపీఎల్ 2022లో ఆడిన రెండు మ్యాచ్‌లలో, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు.

ప్లేఆఫ్ కోసం ఆర్సీబీ రెండు మ్యాచ్‌లు గెలవాలి..

ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఆర్సీబీ చివరి రెండు మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంది. హైదరాబాద్ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. రెండు మ్యాచ్‌లు గెలిచినా కొన్ని జట్ల ఫలితాలపైనే ఆర్బీసీ ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..