AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: గాయం కారణంగా 4 నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు.. తిరిగొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరంటే

సాధారణంగా గాయం తర్వాత, ఏ ఆటగాడైనా ట్రాక్‌కి తిరిగి రావడానికి సమయం పడుతుంది. తిరిగి పాత ఫామ్‌ని పొందడానికి ఎంతో కొంత సమయం తీసుకుంటారు. కానీ ఓ క్రికెటర్‌ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. నాలుగు నెలలకు గ్రౌండ్‌కు దూరమైన ఆ స్టార్‌ క్రికెటర్‌ తిరిగొచ్చాక మాత్రం చెలరేగిపోతున్నాడు. ఇంతకీ ఆ స్టేర్‌ ప్లేయర్‌ ఎవరో

IPL 2023: గాయం కారణంగా 4 నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు.. తిరిగొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరంటే
oyal Challengers Bangalore
Narender Vaitla
|

Updated on: May 18, 2023 | 4:18 PM

Share

సాధారణంగా గాయం తర్వాత, ఏ ఆటగాడైనా ట్రాక్‌కి తిరిగి రావడానికి సమయం పడుతుంది. తిరిగి పాత ఫామ్‌ని పొందడానికి ఎంతో కొంత సమయం తీసుకుంటారు. కానీ ఓ క్రికెటర్‌ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. నాలుగు నెలలకు గ్రౌండ్‌కు దూరమైన ఆ స్టార్‌ క్రికెటర్‌ తిరిగొచ్చాక మాత్రం చెలరేగిపోతున్నాడు. ఇంతకీ ఆ స్టేర్‌ ప్లేయర్‌ ఎవరో మీకు అర్థమైందా.? అవును ఇదంతా.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గురించే.

గతేడాది మెల్‌బోర్నోలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో జారిపడ్డ సంఘటనలో మాక్స్‌వెల్ కాలు విరిగింది. గాయం కారణంగా చాలా కాలంపాటు గ్రౌండ్‌కి దూరంగా ఉన్నాడు మాక్స్‌వెల్‌. శస్త్రచికిత్స కూడా చేశారు. సుమారు 4 నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న అతను ఫిబ్రవరిలో దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. వచ్చీ రాగానే పూర్తిగా భిన్నమైన శైలిలో కనిపించాడు. అనంతరం ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన మాక్స్‌వెల్‌ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరులో చేరి విధ్వంసక ఆటతీరున ప్రదర్శిస్తున్నాడు.

గాయం తర్వాత మ్యాక్స్‌వెల్ మరింత దూకుడు పెంచాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 384 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 34.91. మొత్తం 5 ఆఫ్‌ సెంచరీలు చేశాడు. అతని ఫామ్‌ చూస్తుంటే అసలు కాలుకు సర్జరీ అయిందా అన్న అనుమానాలు రాక మానవు. మాక్స్‌వెల్కు బెంగళూరుతో 2021 నుంచి అనుబంధం కలిగి ఉన్నాడు. అప్పటి నుంచి అతని గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది.

ఇవి కూడా చదవండి

బెంగళూరు జట్టులో చేరడానికి ముందు, మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో 154.7 స్ట్రైక్ రేట్‌తో 78 ఇన్నింగ్స్‌లలో 1505 పరుగులు చేశాడు . ఇందులో 6 ఆఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2021లో బెంగళూరులో చేరిన తర్వాత 39 ఇన్నింగ్స్‌ల్లో 1198 పరుగులు చేశాడు. బెంగళూరు జట్టులో చేరిన తర్వాత మాక్స్‌ వెల్‌ ఆటతీరు బాగా మెరుగైంది. గాయం తర్వాత అతని మాట తీరు మరింత మెరుగైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..