Telugu News Sports News Cricket news SRH vs RCB: Virat Kohli slams sensational ton against Sunrisers Hyderabad to end 4 year wait for IPL century and equals Gayle's magnificent record
SRH vs RCB: హైదరాబాద్‌లో సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లీ.. అత్యధిక ఐపీఎల్ శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు..
Virat Kohli: ఎట్టకేలకు కింగ్ కోహ్లీ తన బ్యాట్ నుంచి మరో సెంచరీ ఝులిపించాడు. దీంతో కోహ్లీ ఖాతాలోకి 6వ ఐపీఎల్ సెంచరీ చేరింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ 62 బంతుల్లో 100 పరుగుల మార్క్‌ను..
Virat Kohli: ఎట్టకేలకు విరాట్ కింగ్ కోహ్లీ తన బ్యాట్ నుంచి మరో సెంచరీ ఝులిపించాడు. దీంతో కోహ్లీ ఖాతాలోకి 6వ ఐపీఎల్ సెంచరీ చేరింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ 62 బంతుల్లో 100 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. అయితే సెంచరీ కోసం సిక్సర్ కొట్టిన కోహ్లీ ఆ తరువాతి బంతికే వెనుదిరిగాడు. అలాగే ఈ సెంచరీ ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇక కోహ్లీ చివరిసారిగా 2019 ఐపీఎల్ సీజన్ సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మీద 58 బంతుల్లో సెంచరీ చేశాడు. అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత కింగ్ కోహ్లీ ఐపీఎల్ సెంచరీని సాధించాడు. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే.. అప్పుడు కూడా కోహ్లీ సెంచరీ చేసి, మరుసటి బంతికే వెంటనే వెనుదిరిగాడు.
కాగా, నేడు జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున హెన్రిచ్ క్లాసెన్(104) సెంచరీతో చెలరేగాడు. ఇక అనంతంర క్రీజులోకి వచ్చిన ఆర్‌సీబీకి ఎదురులేని శుభారంభం లభించింది. కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్(71), కోహ్లీ(100) నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చాయి. చివర్లో మిగిలి ఉన్న లక్ష్యాన్ని గ్లెన్ మ్యాక్స్‌వెల్(5), మైకేల్ బ్రేస్‌వెల్(4) పూర్తి చేశారు. దీంతో ఆర్‌సీబీ ఖాతాలో కీలక విజయం చేరింది. ఇక ఈ విజయంతో ఆర్‌సీబీ తన ప్లేఆఫ్ ఆశలను నిలుపుకుంది.