IPL 2023: పంజాబ్ కింగ్స్ కొంప ముంచిన వార్నర్ సేన.. లివింగ్‌స్టన్ విరోచిత పోరాటం వృథా..
PBKS vs DC: ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత పుంజుకుంది. ఫలితంగా పంజాబ్ కింగ్స్ తన కీలక మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే..
PBKS vs DC: ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత పుంజుకుంది. ఫలితంగా పంజాబ్ కింగ్స్ తన కీలక మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ధావన్ సేన ఓడిపోవడంతో.. ఆ టీమ్ కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినట్లే అయింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ తరఫున వార్నర్(46), ఫృధ్వీ షా(54), రిలీ రూసో(82, నాటౌట్), సాల్ట్(26,(82, నాటౌట్) మెరుగ్గా రాణించారు. ఇక పంజాబ్ తరఫున సామ్ కర్రన్ ఢిల్లీ ఓపెనర్లను పెవిలియన్ చేర్చి, రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం లభించలేదు. గత మ్యాచ్ సెంచరీ హీరో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(22) కొంతమేర పర్వాలేదనిపించగా.. అధర్వ థైడే(55,రిటైర్డ్ హర్ట్) అర్ధసెంచరీతో చెలరేగాడు. అనంతరం వచ్చిన లియన్ లివింగ్‌స్టన్(94) విరోచితమైన బ్యాటింగ్ చేశాడు. అయితే తన సెంచరీకి మరో 6 పరుగులు కావలసిన సమయంలో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు లివింగ్‌స్టన్. అనంతరం వచ్చినవారిలో సామ్ కర్రన్(11)తో సహా అందరూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో పంజాబ్ టీమ్ 8 వికెట్ల నష్టానికి 198 పరుగులే చేయగలిగింది. ఫలితంగా ఢిల్లీ ఖాతాలోకి విజయం చేరింది.
కాగా, ఐపీఎల్ 2023 టోర్నీ ప్లేఆఫ్స్ నుంచి ముందుగానే ఎలిమినేట్ అయిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఢిల్లీ ఖాతాలో పడిన ఈ విజయం పంజాబ్ టీమ్‌కి అడ్డుకట్టగా మారింది. 13 మ్యాచ్‌లలో 6 గెలిచిన పంజాబ్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. 12 పాయింట్లు కలిగిన ధావన్ సేన ప్లేఆఫ్స్‌కి చేరడం పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే ఇప్పటికే టాప్ 4 ప్లేస్‌లలో ఉన్న జట్లు 14, అంతకంటే ఎక్కువ పాయింట్లను కలిగి ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..