Mouth Fresh Tips: నోటి దుర్వాసన వేధిస్తోందా? ఈ 5 అలవాట్లో చెక్ పెట్టండి..

పరిశుభ్రతో భాగంగా నోటిని నిర్వహించడం కూడా కీలకం. నోరు విషయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే.. నోటి దుర్వాసనతో సహా అనేక అనారోగ్య సమస్యలకు దారీతీయవచ్చు. నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా పిలుస్తారు. పబ్లిక్‌గా ఉన్నప్పుడు లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా..

Mouth Fresh Tips: నోటి దుర్వాసన వేధిస్తోందా? ఈ 5 అలవాట్లో చెక్ పెట్టండి..
Mouth Bad Smell
Follow us

|

Updated on: May 18, 2023 | 10:05 PM

పరిశుభ్రతో భాగంగా నోటిని నిర్వహించడం కూడా కీలకం. నోరు విషయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే.. నోటి దుర్వాసనతో సహా అనేక అనారోగ్య సమస్యలకు దారీతీయవచ్చు. నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా పిలుస్తారు. పబ్లిక్‌గా ఉన్నప్పుడు లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉన్నప్పుడు దుర్వాసన ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా.. నోటికి సంబందించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండటంతో పాటు, చెడు దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. 5 అలవాట్లు మీ నోటిని శుభ్రంగా ఉంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం..

నోటి దుర్వాసన రాకుండా ఉండాలన్నీ, ఆరోగ్యంగా ఉండాలన్నా రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. ఉదయం బ్రష్ చేయడం, నాలుక స్క్రాప్ చేయడం వల్ల రాత్రిపూట నోట్లో పేరకుపోయిన అన్ని టాక్సిన్స్ బయటకు పోతాయి. అప్పుడు నోరు శుభ్రంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేసి పడుకోవాలి.

భోజనం తరువాత ఫెన్నెల్ గింజలు తినడం..

ఫెన్నెల్ గింజలు తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇది లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా నోరు పొడిబారకుండా చేస్తుంది. ఫెన్నెల్ గింజలు సుగంధ రుచిని కలిగి ఉంటాయి. ఇది నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

భోజనం తరువాత పుక్కిలించాలి..

ఆయుర్వేదం ప్రకారం.. భోజనం చేసిన వెంటనే నీరు తాగొద్దు. అలా చేస్తే జీవ్రక్రియ నెమ్మదిస్తుంది. అయితే, నోటిని శుభ్రం చేయడానికి భోజనం తరువాత నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోట్లో మిగిలిపోయిన, ఇరుక్కుపోయిన ఆహారాన్ని బయటకు పంపుతుంది.

సమయం ప్రకారం తినాలి..

భోజనాన్ని సమయం ప్రకారం తినాలి. అతిగా తినొద్దు. ఏదైనా ఆహారం తింటే కొన్ని కొన్నిసార్లు పళ్ల మధ్యన ఇరుక్కుపోతుంది. తద్వారా కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అందుకే, తినే ఆహారాన్ని చూసుకోవడంతో పాటు.. తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి.

తగినంత నీరు తాగాలి..

ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం తప్పనిసరి. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. తగినంత నీరు తాగడం తప్పనిసరి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..