రాంచరణ్, ఉపాసన దంపతులు పిల్లలను కనేందుకు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు…
సినీ నటుడు రామ్ చరణ్ అలాగే ఆయన సతీమణి ఉపాసన కామినేని ఇరువురు అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.

సినీ నటుడు రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని ఇరువురు అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన కామినేని గర్భవతిగా ఉంది.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మినవ్వనుంది. రామ్ చరణ్ దంపతులకు వివాహం జరిగి ఇప్పటికే దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఉపాసన కామినేని వయసు దాదాపు 35 సంవత్సరాలు దాటింది. ఇంత లేటు వయసులో పిల్లలను కనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఉపాసన కామినేని తన పెళ్లి అయిన మొదటి ఏడాదిలోనే తన అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరిచారనే వార్తలు వస్తున్నాయి. దీని వెనుక కారణం లేకపోలేదు. సాధారణం, లేటు వయసులో అండాలు సరిగ్గా విడుదల కావు.. అలాంటి సమయంలో గతంలో భద్రపరిచిన అండాలను ఫలదీకరణం చేసి గర్భంలో ప్రవేశపెట్టే ప్రక్రియ అందుబాటులో ఉంది. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
తాజాగా ఉపాసన కామినేని మిడ్ డే అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తమ జంట పెళ్లయిన కొత్తలోనే అండాలను భద్రపరచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాము కాస్త లేటుగా పిల్లలను కనాలని ప్లాన్ చేశామని, అందులో భాగంగా యుక్త వయసులోనే విడుదలయ్యే అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో స్టోర్ చేసామని తెలిపారు. ఈ ప్రక్రియను మెచూర్ ఓసైట్ క్రయో ప్రిజర్వేషన్ లేదా ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. “ఈ పద్ధతిలో, అండాశయాల నుండి ఫలదీకరణం చేయని గుడ్లను సేకరించి, తర్వాత వాటిని ఫ్రీజ్ చేస్తారు, అక్కడ వాటిని స్పెర్మ్‌తో కలిపి మాన్యువల్‌గా గర్భాశయంలో అమర్చుతారు” అని బిర్లా ఫెర్టిలిటీ, IVF కన్సల్టెంట్ డాక్టర్ స్వాతి మిశ్రా చెప్పారు.
అయితే ఈ పద్ధతి ద్వారా పిల్లలను కలవడం సేఫ్ అని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. నిజానికి ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో స్త్రీ యొక్క అండాలను భద్రంగా దాచుకునే అవకాశం ఉంది. ఎవరైతే పిల్లలను లేటుగా కణాలని ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం అని చెప్పవచ్చు. తద్వారా భవిష్యత్తులో పీరియడ్స్ రాకపోయినా లేక మరేదైనా జబ్బు చేసి అండాశయం ఇన్ఫెక్షన్ కు గురైన ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం పొందే వీలు దక్కుతుంది. ముఖ్యంగా మహిళలు చాలామంది తమ కెరీర్ ను కొనసాగించే దశలో పిల్లలను లేటుగా కనాలని నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వారు తమ అండలను ఈ పద్ధతి ద్వారా స్టోర్ చేసుకుంటే, భవిష్యత్తులో పిల్లలను కలడం సులభం అవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.




ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ప్రస్తుతం మన భారత దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోనూ అందుబాటులో ఉంది. అమ్మాయిలు ఎవరైతే పిల్లలను లేటుగా కనాలని ప్లాన్ చేస్తున్నారు అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం అనే చెప్పవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం