పేరు చివర కులం లేదని వెళ్లిపోయిన పెళ్లికొడుకు.. నిలిచిపోయిన పెళ్లి

రాకెట్లు దూసుకుపోతున్న కాలంలో కూడా కులం పేరుతో నయవంచన జరగడం కనిపిస్తూనే ఉంది. కొంతమంది మానవత్వానికంటే కులానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పేరు చివర తమ కులాన్ని తగిలించుకోవడం కొన్ని సామాజికవర్గాల్లో ఆనవాయితీగా వస్తున్నదే. దాన్ని ఎవ్వరూ కదనలేం. కానీ పచ్చని పందిట్లో ఓ పెళ్లి మధ్యలోనే ఆగిపోడానికి వధువు పేరుచివర ఆ సామాజికవర్గం పేరు లేకపోవడమే కారణమైంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో […]

పేరు చివర కులం లేదని వెళ్లిపోయిన పెళ్లికొడుకు.. నిలిచిపోయిన పెళ్లి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 25, 2019 | 5:12 PM

రాకెట్లు దూసుకుపోతున్న కాలంలో కూడా కులం పేరుతో నయవంచన జరగడం కనిపిస్తూనే ఉంది. కొంతమంది మానవత్వానికంటే కులానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పేరు చివర తమ కులాన్ని తగిలించుకోవడం కొన్ని సామాజికవర్గాల్లో ఆనవాయితీగా వస్తున్నదే. దాన్ని ఎవ్వరూ కదనలేం. కానీ పచ్చని పందిట్లో ఓ పెళ్లి మధ్యలోనే ఆగిపోడానికి వధువు పేరుచివర ఆ సామాజికవర్గం పేరు లేకపోవడమే కారణమైంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఈ సంఘటన జరిగింది. పెళ్లి కూతురు పేరులో ‘రెడ్డి’ అని లేదని పెళ్లి పీటలపైనే పెళ్లిని ఆపేశారు అత్తింటివారు. కాసేపట్లో మెడలో మూడుముళ్లు పడతాయనే సమయంలో వధువు పేరు చివర “రెడ్డి” అని లేదని పీటలపై నుంచి లేచి వెళ్లిపోయాడు పెళ్లి కొడుకు.

సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన మున్నంగి వెంకట రెడ్డికి క్రోసూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెళ్లి జరగాల్సి ఉంది. వీరిద్దరికీ గుంటూరు సమీపంలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. అనుకున్న సమయానికి వధూవరులిద్దరూ పెళ్లి రెడీ అయి ఆలయానికి వచ్చారు. ఇక పెళ్లికి కొన్ని నిమిషాలే వ్యవధి ఉందనగా పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోనంటూ వెళ్లి పోయాడు. ఏంటీ కారణం అని అడిగితే పెళ్లి కూతురు, ఆమె తండ్రి ఆధార్ కార్డ్‌లలో వారి పేర్ల చివర రెడ్డి అని లేదని సమాధానమిచ్చి అక్కడినుంచి వెళ్లి పోయాడు. దీంతో జరిగిన అవమానాన్ని భరించలేక వధువు తరపు బంధువులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.