అమరావతి రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం : మంత్రి గడ్కరీ వెల్లడి
ఏపీ రాజధాని అమరావతి రింగ్ రోడ్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి రింగ్ రోడ్డును డెవలప్ చేసే ప్రాజెక్టుకు గతంలోనే ఆమెదం తెలిపామన్నారు మంత్రి. అయితే దీనికి సరిపడా భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదన్నారు గడ్కరీ. గత ఏపీ ప్రభుత్వం భూసేకరణ ఖర్చును తామే భరిస్తామని చెప్పి ఆతర్వాత 50 శాతం కేంద్రమే భరించాలని కోరిందని చెప్పారు. గత […]
ఏపీ రాజధాని అమరావతి రింగ్ రోడ్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి రింగ్ రోడ్డును డెవలప్ చేసే ప్రాజెక్టుకు గతంలోనే ఆమెదం తెలిపామన్నారు మంత్రి. అయితే దీనికి సరిపడా భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదన్నారు గడ్కరీ.
గత ఏపీ ప్రభుత్వం భూసేకరణ ఖర్చును తామే భరిస్తామని చెప్పి ఆతర్వాత 50 శాతం కేంద్రమే భరించాలని కోరిందని చెప్పారు. గత ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పనులు ఆగిపోయాయని ఆయన వెల్లడించారు. అమరావతి- అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే 348 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించామని దీని ఖర్చులో 50శాతం కేంద్రమే భరిస్తుందని కూడా మంత్రి తెలిపారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన పర్యావరణం, అటవీ, వన్యప్రాణి చట్టాలకు సంబంధించిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వమే తెచ్చుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.