Worst Foods for Digestion : ఆరోగ్యానికి మంచిదని ఎడా పెడా ముద్దపప్పు తినేస్తున్నారా, ఇలా తింటే రోగాల బారిన పడే ఛాన్స్!!

పప్పు తింటే ప్రోటీన్స్ వస్తాయని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా మాంసాహారం తినని వారికి పప్పులు అనేది అసలైన ప్రోటీన్ సోర్స్.

Worst Foods for Digestion : ఆరోగ్యానికి మంచిదని ఎడా పెడా ముద్దపప్పు తినేస్తున్నారా, ఇలా తింటే రోగాల బారిన పడే ఛాన్స్!!
Dal
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Feb 24, 2023 | 9:54 AM

పప్పు తింటే ప్రోటీన్స్ వస్తాయని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా మాంసాహారం తినని వారికి పప్పులు అనేది అసలైన ప్రోటీన్ సోర్స్. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. తద్వారా మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంటాయి. అయితే పప్పు దినుసులను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలని నిపుణులు చెబుతున్నారు లేకపోతే, అది కలిగించే లాభం కన్నా హాని ఎక్కువగా ఉంటుందని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.

పోషకాహార నిపుణుల ప్రకారం సరైన మొత్తంలో పోషకాహారం తీసుకోవడం మన జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఇలా- ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, ధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఇది మన జీర్ణక్రియను చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు మనకు ఏది మంచిది, ఏది చెడు అనే దానిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.

పెరుగుతో లాభం ఇదే:

ఇవి కూడా చదవండి

పెరుగు,ఊరగాయలు,మజ్జిగ, పులిసిన పిండితో చేసిన ఇడ్లీ లాంటి ప్రోబయోటిక్ ఆహారాలు ప్రేగులకు చాలా మంచివిగా పరిగణిస్తారు. అవి ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతకు మద్దతు ఇస్తాయి. వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది.

చిరుధాన్యాలతో రోగాలు దూరం:

చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు, రాగులతో పాటు వోట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, లలో పోషకాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలు, ఫైబర్‌తో లోడ్ అవుతాయి, ఇవిమలబద్ధకాన్ని నివారిస్తాయి.

పండ్లు:

మీ జీర్ణవ్యవస్థకు ఉత్తమమైన పండ్లు యాపిల్స్, బెర్రీలు, ఖర్జూరాలు, ఉసిరికాయ, నారింజ వంటి పండ్లలో ఫైబర్, పోషకాలు అధిక మొత్తంలో నీరు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తాయి, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

హెర్బల్ టీ:

చామంతి, తంగేడు, పుదీనా, గ్రీన్ టీ వంటి మూలికలతో కూడిన వేడి టీలను భోజనం తర్వాత తాగడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫలితంగా గ్యాస్, వికారం, కడుపు తిమ్మిరి, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఉదర కండరాలను బలపరుస్తుంది.

వీటికి దూరంగా ఉండాలి:

వేయించిన ఆహారం పకోడీలు, బజ్జీలు, బర్గర్లు, నూడుల్స్ వంటి జంక్ ఫుడ్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. డయేరియా లూజ్ మోషన్‌లకు దారితీస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం:

ప్యాక్ చేసిన ఆహారాలలో పోషకాహార లోపం, చక్కెర అధికంగా, పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి ఉదాహరణకు వేయించిన చిప్స్, ప్రాసెస్ చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన రెడీ టు ఈట్ ఫుడ్స్ ఆరోగ్యానికి అసలు మంచివి కావు వీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్యం పాలవుతారు.

మద్యం:

ఆల్కహాల్ జీర్ణవ్యవస్థను చికాకుపెడుతుంది, నెమ్మదిస్తుంది, యాసిడ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.

పప్పు దినుసులు:

పప్పు దినుసులను వండే ముందు ముందుగా రెండు మూడు గంటల పాటు నాన పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాతనే ఉడకబెట్టుకొని సా సాంబారు టమాటా పప్పు ఆకుకూర పప్పులో వాడుకోవచ్చు ముఖ్యంగా కందిపప్పును ఎక్కువగా పప్పు దినుసులు వాడుతుంటారు. ప్రెషర్ కుక్కర్ ద్వారా ఉడికించడం చాలా ఉత్తమమని చెప్పవచ్చు ప్రెజర్ కుక్కర్లో పప్పు దినుసులు సమంగా ఉడుకుతాయి. పప్పు దినుసులను సరిగ్గా ఉడికించకపోతే అజీర్ణం అవుతుంది తద్వారా పేగులు దెబ్బ తినే ప్రమాదం ఉంది అలాగే గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది.