Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయస్సులో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే వెల్లుల్లి, నిమ్మకాయతో ఇలా చేయండి..

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారిలో సైతం గుండె సంబంధిత వ్యాధులను మనం గమనించవచ్చు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోవడమే...

చిన్న వయస్సులో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే వెల్లుల్లి, నిమ్మకాయతో ఇలా చేయండి..
Garlic
Follow us
Madhavi

| Edited By: Narender Vaitla

Updated on: Feb 24, 2023 | 10:27 AM

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారిలో సైతం గుండె సంబంధిత వ్యాధులను మనం గమనించవచ్చు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోవడమే. ముఖ్యంగా గుండె రక్తం నాలాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బ్లాకు ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఎలా పెడ మందులు జోలికి వెళ్లకుండా, వంట ఇంటి చిట్కాలతో సైతం రక్తంలో కొలెస్ట్రాలలో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటి ఓ వంటింటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం.

ప్రాచీన కాలం నుంచి కూడా అల్లం, వెల్లుల్లి రెండింటిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. ఈ రెండు పదార్థాలకు శరీరంలో అనేక వ్యాధులను పోగొట్టే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో శరీరంలోని కొలెస్ట్రాలను కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే నిమ్మకాయలలో కూడా కొలెస్ట్రాలను కలిగించే లక్షణాలు ఉంటాయి. అందుకే కొంతమంది నిపుణులు ఈ రెండింటిని కలిపి తీసుకోమని సూచిస్తున్నారు. సాధారణంగా నిమ్మకాయ అల్లం రసం కలిపి తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ నిమ్మకాయ వెల్లుల్లి సైతం కలిపి తీసుకోవడం ద్వారా గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రెండింటిని ఎలా కలిపి తీసుకోవాలో చూద్దాం.

వెల్లుల్లి:

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో సహాయపడుతుంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు వెల్లుల్లి మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

నిమ్మకాయ:

నిమ్మకాయ చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తుంది. ఇది అనేక విటమిన్లు , డైటరీ ఫైబర్‌లను కలిగి ఉండటంతో రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.

నిమ్మకాయ, వెల్లుల్లి:

నిమ్మకాయ, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండింటి కలయిక అనేక వ్యాధులను నివారిస్తాయి. వెల్లుల్లి , నిమ్మరసం తీసుకుని, వెల్లుల్లిని బాగా తరిగి, ఒక గిన్నెలో వేసి, ఆపై నిమ్మరసం వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి, ఇరవై ఐదు రోజులు మితమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. వెల్లుల్లిని నిమ్మకాయతో బాగా కలపడానికి ప్రతిరోజూ గిన్నెను కదిలించాలి. దీన్ని ఒక చెంచా అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మీ శరీరంలో కొలస్ట్రాల్ కరిగిపోతుంది.

ఖాళీ కడుపుతో వెల్లుల్లి, నిమ్మకాయ:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లితో నిమ్మరసం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు, పిత్తాశయం రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అధిక బరువును వదిలించుకోవడానికి పనిచేస్తుంది. హానికరమైన కొవ్వుల నుండి మనలను విడుదల చేస్తుంది. ఇది హై బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెలో ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు నిమ్మకాయ, వెల్లుల్లితో ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..