- Telugu News Photo Gallery Science photos Aliens Secrets: Mysterious Places on earth where aliens and ufo spotted many times
Aliens: గ్రహాంతరవాసులు ఎక్కువగా కనిపించే ప్రపంచంలోని రహస్యమైన ప్రదేశాలు ఇవే..!
గ్రహాంతరవాసులు ఉన్నారా? లేదా? అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా రకాల వాదనలు ఉన్నాయి. గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తూ పోతూ ఉంటారని కొందరి నమ్మకం. అయితే, ఇవాళ మనం గ్రహాంతరవాసులు
Updated on: May 18, 2023 | 10:15 PM

గ్రహాంతరవాసులు, UFO లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్వంలో గ్రహాంతర వాసులు ఉన్నారని కొందరు నమ్ముతారు. మరికొందరు ఏలియన్స్ లేరని అంటారు. అయితే, ఏలియన్స్ ఉనికిని విశ్వసించిన కొంతమంది శాస్త్రవేత్తలతో సహా, కొందరు సంబంధిత లక్ష్యాలను అందించారు. ఈ సాక్ష్యాల ప్రకారం.. ప్రపంచంలో ఏలియన్స్ ఎక్కువగా సంచరించే ప్రదేశాలు చాలానే ఉన్నాయని, ఆ ప్రాంతాలకు గ్రహాంతర వాసులు వస్తూ పోతూ ఉంటారని పేర్కొన్నారు. ఆ రహస్యమైన ప్రదేశాలు ఏవో చూద్దాం. వాటి గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. (Photo Courtesy: Pixabay)

USAలోని నెవాడాలో ఉన్న ఏరియా 51 గురించి అనేక వాదనలు ఉన్నాయి. ఇక్కడ సాధారణ పౌరుల రాకపోకలపై నిషేధం ఉన్నందున, ఇక్కడ గ్రహాంతరవాసులను ఉంచి పరిశోధనలు జరుపుతున్నారని అంతా భావిస్తారు. అంతేకాదు.. గ్రహాంతరవాసులు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారని కూడా కొందరి వాదన. కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. (Photo Courtesy: Pixabay)

మంచుతో కప్పబడిన అంటార్కిటికాలో ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులకు చోటు ఉండవచ్చని కొందరు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో గ్రహాంతరవాసులకు చెందిన UFOలను చూసినట్లు చాలా మంది పేర్కొన్నారు. 2021 సంవత్సరంలో కూడా కొందరు వ్యక్తులు ఇక్కడ ఒక రహస్యమైన UFO ని చూశామని పేర్కొన్నారు. (Photo Courtesy: Pixabay)

బ్రిటన్‌లోని చాలా ప్రదేశాలలో.. ప్రజలు UFOలను చూశారని చెబుతుంటారు. వారి వాదన ప్రకారం.. బ్రిటన్ గ్రహాంతరవాసులకు ఇష్టమైన ప్రదేశంగా పేర్కొంటారు. యార్క్‌షైర్‌లో గ్రహాంతరవాసులు వస్తూ పోతూ ఉంటారని, వారి వాహనాలను కూడా ప్రజలు చూశారని అంటుంటారు. (Photo Courtesy: Pixabay)

న్యూ మెక్సికోలో మెక్సికన్ తెగ ప్రజలు నివసించే ఒక గ్రామం ఉంది. గ్రామానికి సమీపంలో అమెరికాకు చెందిన రహస్య ఆర్మీ బేస్ ఉందని, అక్కడికి గ్రహాంతర వాసులు వస్తూ పోతూ ఉంటారని ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. అంతేకాదు.. కొందరు షాకింగ్ ఆరోపణలు కూడా చేశారు. గ్రహాంతర వాసులు తమ ఆవులను ఎత్తుకెళ్లి అవయవాలను కోసి పారేస్తారని అంటున్నారు. (Photo Courtesy: Pixabay)





























