Watch Video: ఈ దూకుడు.. చిరుతకు సాటెవ్వరు.. వీడియో చూస్తే ‘గుండె’ కాస్తా ప్యాంట్‌లోకి జారాల్సిందే..
అత్యంత క్రూర మృగాలలో చిరుత పులి ఒకటి. చిరుత వేగం ముందు.. ఏ ప్రాణీ నిలవలేదు. అందుకే అది వేటాడితే.. ప్రత్యర్థి జీవి దానికి ఆహారం అవ్వాల్సిందే. చిరుత వేగమే కాదు.. దాని వేట కూడా భీకరంగా ఉంటుంది. చాలా దూరం నుంచే తన వేటను గుర్తించే చిరుత..
అత్యంత క్రూర మృగాలలో చిరుత పులి ఒకటి. చిరుత వేగం ముందు.. ఏ ప్రాణీ నిలవలేదు. అందుకే అది వేటాడితే.. ప్రత్యర్థి జీవి దానికి ఆహారం అవ్వాల్సిందే. చిరుత వేగమే కాదు.. దాని వేట కూడా భీకరంగా ఉంటుంది. చాలా దూరం నుంచే తన వేటను గుర్తించే చిరుత.. అత్యంత వేగంగా దూసుకొచ్చి మరీ అటాక్ చేస్తుంది. ఇక పరుగులోనే కాకుండా.. చెట్లు ఎక్కడం, దూకంలోనూ చిరుతకు మించింది లేదు. అచ్చం కోతి మాదిరిగానే చిరుత సునాయాసంగా చెట్లు ఎక్కగలదు. తాను వేటాడిన జీవిని నోట పెట్టుకుని, ఎంత పెద్ద చెట్టునైనా ఈజీగా ఎక్కేస్తుంది. ఎత్తు, దూరం అనేది చిరుతకు అస్సలు మ్యాటరే కాదు. ఇందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పలు సందర్భాల్లో కొన్ని జీవులు, కొందరు వ్యక్తులు చిరుత నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన చెట్లు, గోడలు ఎక్కి తమను తాము కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే, పొరపాటున కూడా అలా చేస్తే అడ్డంగా బుక్కవుతారు. అందుకు సాక్షి రూపం లాంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిరుత పులి భారీ ఎత్తైన ఫెన్సింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో రోడ్డుపై వచ్చిన కొందరు వాహనదారులు ఆ చిరుత ప్రయత్నాన్ని వీడియో తీశారు. దాదాపు 20 అడుగుల ఎత్తైన ఫెన్సింగ్‌ను ఒక్క ఉదుటున దూకేసింది. ఏమాత్రం తడబాటు లేకుండా, మరో ప్రయత్నమే లేకుండా.. ఒక్క జంప్‌తో ఫెన్సింగ్‌ను దాటింది. సింగిల్ షాట్‌లో, రెప్పపాటు కాలంలో చిరుత వేగాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన దృశ్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. చిరుతతో అట్లుంటది మరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
Look at the agility of leopard. One of the most adaptable big cats on earth. Crossing 15+ feet wall so smoothly. Location unknown. pic.twitter.com/gPHi20pHdU
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 13, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..