AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో దారుణం.. తన భార్య, కూతుర్ని రేప్ చేశారంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కూతుర్ని గ్యాంగ్ రేప్ చేశారని చెప్పడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున సైన్ఫీ పోలీస్ స్టేషన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. తన ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారని.. తనని కట్టేసి మొబైల్ ఫోన్, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు.

యూపీలో దారుణం.. తన భార్య, కూతుర్ని రేప్ చేశారంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి
Rape case
Aravind B
|

Updated on: May 23, 2023 | 5:25 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కూతుర్ని గ్యాంగ్ రేప్ చేశారని చెప్పడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున సైన్ఫీ పోలీస్ స్టేషన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. తన ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారని.. తనని కట్టేసి మొబైల్ ఫోన్, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఈసారి తన భార్యతో పాటు, 14 ఏళ్ల కూతురుని కూడా సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశాడు. అయితే అతను చేసిన ఆరోపణలపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు చివరకి కేసు నమేదు చేసుకున్నారు.

అయితే ఆ నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కైఫ్ గా గుర్తించి విచారించారు. గత కొన్నిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి, కైఫ్‌కు మధ్య వివాదం జరిగినందువల్ల ఈ కేసుపై అనుమానం వ్యక్తం చేస్తు్న్నట్సు ఎస్పీ అశోక్ కుమార్ శుక్లా తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని..ఆధారాలు సేకరిస్తామని పేర్కొన్నారు. అలాగే తల్లి కూతుర్ని వైద్య పరీక్షలకు పంపించినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక స్థానిక వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసి భార్యను, కూతుర్ని సామూహిక అత్యచారం చేసిన దారుణమైన ఘటన రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురి చేసిందని ఆరోపించారు. ఇలాంటి నేరాలు యూపీలోని బీజేపీ శాంతి భద్రతలను బహిర్గతం చేస్తున్నాయని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం