మొగల్ కాలం నాటి 400 నాణేలు గుర్తింపు.. ఎక్కడంటే
అప్పుడప్పుడు కొన్ని పురాతన వస్తువులు బయటపడుతూ ప్రాచీన కాలం నాటి చరిత్రను చూపిస్తుంటాయి. చాలామంది అలాంటి వాటిని చూసేందుకు వాటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొగలుల కాలం నాటి నాణేలు బయటపడ్డాయి.
అప్పుడప్పుడు కొన్ని పురాతన వస్తువులు బయటపడుతూ ప్రాచీన కాలం నాటి చరిత్రను చూపిస్తుంటాయి. చాలామంది అలాంటి వాటిని చూసేందుకు వాటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొగలుల కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 400 నాణేలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం హుస్సైన్‌పుర్ గ్రామంలో సతి దామ్ గుడి వద్ద ఓ సరిహద్దు గోడను నిర్మించేందుకు కొంతమంది కూలీలు మట్టిని తవ్వుతుండగా నాణేలను గుర్తించారు.
దీంతో వారు తమకు నాణేలు కనిపించాయంటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నాణేలను తీసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే వాటిపై మొగల్ కాలం నాటి అరబిక్ భాష ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ సాగర్ జైన్ తెలిపారు. పురావస్తుశాఖ ఈ నాణేలను పరిశీలిస్తారని.. వాటి తయారికి వినియోగించిన లోహాలను కూడా నిర్దారిస్తారని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం