ఓ కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. చివరికి నిర్దోషి అని తేల్చిన కోర్టు

కొంతమంది నేరగాళ్లు ఇప్పటికీ బయట తిరుగుతున్నారు. మరికొందరు అమయాకులు మాత్రం జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్లిన ఓ అమాయకుడు దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి రావడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఓ కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. చివరికి నిర్దోషి అని తేల్చిన కోర్టు
Jail
Follow us

|

Updated on: May 23, 2023 | 4:12 AM

కొంతమంది నేరగాళ్లు ఇప్పటికీ బయట తిరుగుతున్నారు. మరికొందరు అమయాకులు మాత్రం జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్లిన ఓ అమాయకుడు దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి రావడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో అబ్దుల్లా ఆయూబ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను ఖుర్షిద్ అనే కానిస్టేబుల్‌కు తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. అయితే ఖుర్షిద్ ఇంటి కిరాయి ఇవ్వకపోవడంతో అబ్దుల్లా అతడ్ని ఇళ్లు ఖళీ చేయించాడు. దీంతో అతనిపై పగబట్టిన ఖుర్షిద్.. రాయ్‌పూర్‌లోని పురాని బస్తీ పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందితో కలిసి కుట్ర పన్నాడు. కోటి రూపాయలు విలువ చేసే హెరాయిన్ కలిగి ఉన్నడనే కేసులో అబ్దుల్లాను ఇరికించాడు. దీంతో 2003 మార్చి 14 అబ్దుల్లాకు జైలు శిక్ష పడింది.

తాను అమాయకుడ్నని అబ్దుల్లా ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న 25 గ్రాముల పౌడర్‌ను లక్నోలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అది హెరాయిన్ కాదు.. సాధారణ తెల్లపౌడర్ అని చాలా ఏళ్లకు తెలిసింది. దీంతో ఒక తప్పుడు కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్లాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ న్యాయస్థానం అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఇటీవలే అతను విడుదలయ్యాడు. కానీ 20 ఏళ్ల తర్వాత అతను నిర్దోషి అని కోర్టు తేల్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇన్నేళ్లపాటు అతడ్ని జైల్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..