Jeff Bezos: గర్ల్ ఫ్రెండ్‌తో అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ ఎంగేజ్‌మెంట్..59 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ
అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జెఫ్ బెజోస్ 59 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడనున్నారు. ఈ క్రమంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ (53)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు పేజ్ సిక్స్ నివేదించింది. ప్రస్తుతం ఈ జంట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం..
అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జెఫ్ బెజోస్ 59 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడనున్నారు. ఈ క్రమంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ (53)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు పేజ్ సిక్స్ నివేదించింది. ప్రస్తుతం ఈ జంట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో విహరిస్తున్నారు. లారెన్ వేలికి హార్ట్ షేప్‌లో ఉన్న రింగ్‌ను ధరించి ఉండటంతో అది ఎంగేజ్‌మెంట్ రింగ్ అయ్యి ఉంటుందని పేజ్ సిక్స్ తన కథనంలో పేర్కొంది. కాగా లారెన్ సాంచెజ్ మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్. బెజోస్- లారెన్ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు పలు మీడాయా కథనాలు వెలువడ్డాయి.
25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్త పలికి 2019లో మొదటి భార్య మెకెంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత లారెన్‌తో బహిరంగా చట్టాపట్టాలేసుకు తిరగడం ప్రారంభించాడు బెజోస్. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సైతం వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. కాగా 2021లో అమెజాన్ సీఈవోగా జెఫ్ బెజోస్ వైదొలగిన విషయం తెలసిందే. ఈ తర్వాత ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.