ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జననం.. తల్లీబిడ్డలు క్షేమం

జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని రిమ్స్‌లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఐదురు నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఐతే బరువు తక్కువగా ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచినట్లు..

ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జననం.. తల్లీబిడ్డలు క్షేమం
Woman Gives Birth To 5 Babies
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2023 | 9:18 AM

జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని రిమ్స్‌లో సోమవారం ఓ మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఐదురు నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఐతే బరువు తక్కువగా ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు.

జార్ఖండ్‌లోని ఛత్రలోని ఇత్ఖోరి బ్లాక్‌కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ సోమవారం రిమ్స్‌లో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పుట్టిన పిల్లలు 750 గ్రాముల నుంచి1.1 కిలోల వరకు బరువున్నారని, అందుకే వారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU)లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఒకే ప్రసవంలో ఐదుగురు పిల్లలు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుందని, డాక్టర్ శశిబాలా సింగ్ డెలివరీ చేసినట్లు రాంచీ ఒబ్‌స్టెట్రిక్ గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సుమన్ సిన్హా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. రిమ్స్ చరిత్రలో ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.