Viral Video: పాప మహా సాద్వి..! భర్త పేరును ఏకంగా నుదిటిపై పచ్చబొట్టు వేయించుకుంది.. ‘మేము అస్సలు నమ్మం’ అంటున్న నెటిజన్లు

భార్యభర్తల ప్రేమానురాగాలు బ్లాక్‌ అండ్‌ వైట్ సినిమాల్లోనో.. నవలల్లోనో అందంగా ఉంటాయి. నిజజీవితంలో సీన్‌ వేరేలా ఉంటుంది. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం కీచులాడుకుంటుంటారు. ప్రేమలు.. పెళ్లిళ్లు.. పెటాకులు అన్నీ నూడిల్స్‌ వండినంత సులువుగా..

Viral Video: పాప మహా సాద్వి..! భర్త పేరును ఏకంగా నుదిటిపై పచ్చబొట్టు వేయించుకుంది.. 'మేము అస్సలు నమ్మం' అంటున్న నెటిజన్లు
Tattooed On Forehead
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 9:56 AM

భార్యభర్తల ప్రేమానురాగాలు బ్లాక్‌ అండ్‌ వైట్ సినిమాల్లోనో.. నవలల్లోనో అందంగా ఉంటాయి. నిజజీవితంలో సీన్‌ వేరేలా ఉంటుంది. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం కీచులాడుకుంటుంటారు. ప్రేమలు.. పెళ్లిళ్లు.. పెటాకులు అన్నీ నూడిల్స్‌ వండినంత సులువుగా అయిపోతున్నాయ్. ఐతే, కొందరు నిజంగానే అన్యోన్యంగా ఉంటారు అది వేరే విషయం. ఐతే భార్యకు భర్తమీద.. భర్తకు భార్య మీద ఎంత ప్రేమ ఉందో చూపమంటే ఎలా తెల్పుతారు? ఆకాశమంత ఎత్తంతా.. సముద్రం లోతంతా అని గాల్లో మేడలు కడుతూ కవితలు అల్లడం కాదు. చేతల్లో చూపమంటే మీరు ఎలా తెల్పుతారనేది ముఖ్యం. మహా అయితే ఓ గిఫ్ట్‌ ఇస్తారు అంతే కదా..? ఐతే ఓ మహాసాద్వి తన పతి దేవుడిపై ప్రేమను తెల్పడానికి ఏకంగా ఆయన పేరును తన నుదుటిపై పచ్చబొట్టేసుకుందండీ..! నమ్మలేకపోతున్నారా? ఐతే మీరిది చదవాల్సిందే..

బెంగళూరుకు చెందిన టాటూ ఆర్టిస్ట్ ఓ మహిళ నుదుటిపై ఆమె భర్త పేరును టాటూ వేస్తు్న్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోకు క్లిప్‌కు మిలియన్లలో వ్యూస్‌.. లక్షల్లో లైక్స్ రావడంతో వైరల్ అయ్యింది. నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘నీకు పిచ్చా.. ప్రేమ హద్దులులేనిది. దానిని చూపాల్సిన పనిలేదు’ అని ఒకరు, ‘దీనిని ప్రేమ అనరు పిచ్చి పీక్స్‌ అంటారు’ అని మరొకరు, ‘ఇది కచ్చితంగా ఫేక్‌’ అని ఇంకొకరు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ వీడియోలో ఉన్న మహిళను చాలా రీల్స్‌ చేసింది. ఈ వీడియోల్లో ఆమె నుదిటి భాగం క్లీన్‌గా ఉంది. కాబట్టి అది పచ్చబొట్టు కాదు నకిలీ అని అసలు విషయం తెల్చేశారు. ఏది ఏమైనా.. నిజం ఒప్పుకోవాల్సిందే. భాగస్వామి పేరు నుదుటిపై పచ్చబొట్టు వేయించుకునేంత ప్రేమ అసాధ్యం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.