Chicken Price: మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధరలు..
చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు మాత్రం నానాటికీ ఊపందుకుంటున్నాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.200 పలికింది. ఆదివారం మార్కెట్‌లో కిలో ఏకంగా..
చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు మాత్రం నానాటికీ ఊపందుకుంటున్నాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.200 పలికింది. ఆదివారం మార్కెట్‌లో కిలో ఏకంగా వంద రూపాయలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర రూ.300లకు చేరుకుంది. డిమాండ్ పెరడంతో ధర ఎంత ఉన్న ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఉన్న పెద్ద మార్కెట్లలో స్కిన్ రూ.290 స్కిన్‌లెస్ రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. ఇతర సాధారణ మార్కెట్లలో మాత్రం రూ.300లకు తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు.
సాధారణంగా వేసవి కాలంలో చికెన్ రేట్లు పెరగటం సహజం. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాన్ని పూడ్చుకొనేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని యజమానులు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి మరో కారణంగా తెలుస్తోంది. దీంతో సాధారణ స్థాయి కంటే అధికంగా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు కోడిగుడ్ల ధరలకు డిమాండ్ అధికంగానే ఉంది. గత నెలలో 25 గుడ్లు సుమారు రూ.100 నుంచి రూ.110 వరకూ విక్రయించగా ఇప్పుడు ఏకంగా రూ.135కు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో గుడ్డు ధర రూ.6, రూ.6.50 చొప్పున విక్రయిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చేయండి.