AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ నటి కిడ్నాప్‌..! రెండు రోజులుగా గాలిస్తున్న పోలీసులు.. వీడియో వైరల్

'కుమారి వర్సెస్ కుమారి' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సునయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తన అందచందాలతో, అభినయంతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ..

ప్రముఖ నటి కిడ్నాప్‌..! రెండు రోజులుగా గాలిస్తున్న పోలీసులు.. వీడియో వైరల్
Actress Sunaina
Srilakshmi C
|

Updated on: May 21, 2023 | 10:19 AM

Share

‘కుమారి వర్సెస్ కుమారి’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సునయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తన అందచందాలతో, అభినయంతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిందని, ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందంటూ నెట్టింట వార్తలు కోడై కూశాయి. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయం కాస్తా తమిళనాడు పోలీసుల వరకు చేరే సరికి ఆమెను వెతికే పనిలో పడ్డారు. నటి సునయన చివరి సారిగా ఎగ్మూర్ నుంగంబాక్కం, కోయంబేడు, విరుగంబాక్కం ప్రాంతాల్లో సంచరించినట్లు సమచారం అందటంతో ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలకు పూనుకున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా వెతకం ప్రారంభించారు.

ఈ క్రమంలో నటి ఇల్లు, నటించిన సినీ నిర్మాణ సంస్థలను కూడా ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో అదంతా ఓ డ్రామా అని.. అమె నటించిన లేటెస్ట్ మువీ ప్రమోషన్స్‌లో భాగాంగా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశామని చావు కబురు చల్లగా చెప్పింది ఈ బ్యూటీ. దీంతో పోలీసులతోపాటు అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సదరు వీడియోను చూసి నిజమేనని నమ్మిన కొందరు నెటిజన్లు రెస్క్యూ సునైనా అనే హ్యాష్‌ట్యాగ్‌తో నానా హంగామా చేశారు. ఇదంతా మువీ ప్రమోషన్స్‌ స్టంట్‌ అని తెలిశాక హమ్మయ్య అనుకున్నారు. ఏదీ ఏమైనా ఇలాంటి స్టంట్స్‌ చేసే ముందు కాస్త ముందూ వెనుకా చూసుకోవాలి కదా అని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయాని కోస్తే.. ఇటీవల విశాల్‌కు జోడీగా ‘లాఠీ’ మువీలో మెరసిన ఈ కోలీవుడ్​బ్యూటీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. దాదాపు 15 ఏళ్ల ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఎయిరా ప్రొడక్షన్స్‌’ బ్యానర్ ‘రెజీనా’ అనే సినిమాలో నటిస్తోంది. దాదాపు నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు