AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: కర్నూలులో టెన్షన్ టెన్షన్.. ఓ వైపు పోలీసులు.. మరోవైపు ఎంపీ అవినాష్‌ అనుచరులు..

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ, ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖల పర్వం కొనసాగుతోంది. మరోసారి సీబీఐకి లేఖ రాశారు ఆయన. తన తల్లి ఆరోగ్యం బాగోలేని కారణంగా ఈరోజు విచారణకు హాజరుకాలేనన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాతే విచారణకు హాజరవుతానంటున్నారు అవినాష్ రెడ్డి.

YS Viveka Murder Case: కర్నూలులో టెన్షన్ టెన్షన్.. ఓ వైపు పోలీసులు.. మరోవైపు ఎంపీ అవినాష్‌ అనుచరులు..
Ys Viveka Murder Case
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2023 | 7:30 AM

Share

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ, ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖల పర్వం కొనసాగుతోంది. మరోసారి సీబీఐకి లేఖ రాశారు ఆయన. తన తల్లి ఆరోగ్యం బాగోలేని కారణంగా ఈరోజు విచారణకు హాజరుకాలేనన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాతే విచారణకు హాజరవుతానంటున్నారు అవినాష్ రెడ్డి. ఇప్పటికే రెండుసార్లు అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఈనెల 16న,19న మరోసారి విచారణ రాలేనని అవినాష్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌ దగ్గర టెన్షన్ నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసుల మోహరింపు.. మరోవైపు అవినాష్‌కు మద్దతుగా వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారు. హాస్పిటల్‌ పరిసరాలన్నింటినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అక్కడకు చేరుకుంటున్న కార్యకర్తలను పోలీసులు తిరిగి వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అవినాష్ విఙ్ఞప్తిపై సీబీఐ ఇప్పటిదాకా స్పందించలేదు. దీంతో సీబీఐ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల రెండు సార్లు అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరు కావడంతో… సీబీఐ ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఇటీవల నోటీసులు ఇచ్చింది. శుక్రవారం సీబీఐ విచారణకు అవినాష్‌ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా…. తన తల్లికి గుండెపోటు వచ్చిందన్న సమాచారంతో సీబీఐ విచారణకు వెళ్లలేకపోయారు. తన న్యాయవాదులను సీబీఐ కార్యాలయానికి పంపి సమాచారం అందించారు. అవినాష్‌ రెడ్డి తల్లికి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండడంతో ఆయన ఆసుపత్రిలో ఉండిపోయారు. దీంతో సోమవారం విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. కాని.. తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి మళ్లీ లేఖ రాశారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది.

అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ పరిస్థితి బాగోలేకపోవడంతో కర్నూలు గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చించారు. వైద్యులు ఆమెకు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. లోబీపీ, ఈసీజీలో కొన్ని మార్పులు ఉన్నాయని, కార్డియాక్‌ ఎంజేమ్స్‌ బాగా పెరగడంతో యాంజియోగ్రామ్‌ చేయాల్సి వస్తుందని గుండె సంబంధిత వైద్యుడు హితేష్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ లో తెలిపారు. సీబీఐ పిలిచిన ప్రతిసారీ ఎంపీ అవినాష్‌ రెడ్డి కోర్టులో పిటిషన్‌ వేస్తూ, గడువు కోరుతూ విచారణను జాప్యం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు విచారణకు హాజరుకాకపోతే.. సీబీఐ ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?