News Watch Live: విచారణకు రాలేను సీబీఐ ఏం చేయబోతోంది..? Avinash Reddy Vs CBI.. వీక్షించండి న్యూస్ వాచ్.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ, ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖల పర్వం కొనసాగుతోంది. మరోసారి సీబీఐకి లేఖ రాశారు ఆయన. తన తల్లి ఆరోగ్యం బాగోలేని కారణంగా ఈరోజు విచారణకు హాజరుకాలేనన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాతే విచారణకు హాజరవుతానంటున్నారు అవినాష్ రెడ్డి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ, ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖల పర్వం కొనసాగుతోంది. మరోసారి సీబీఐకి లేఖ రాశారు ఆయన. తన తల్లి ఆరోగ్యం బాగోలేని కారణంగా ఈరోజు విచారణకు హాజరుకాలేనన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాతే విచారణకు హాజరవుతానంటున్నారు అవినాష్ రెడ్డి. ఇప్పటికే రెండుసార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఈనెల 16న,19న మరోసారి విచారణ రాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర టెన్షన్ నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసుల మోహరింపు.. మరోవైపు అవినాష్‌కు మద్దతుగా వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారు. హాస్పిటల్ పరిసరాలన్నింటినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అక్కడకు చేరుకుంటున్న కార్యకర్తలను పోలీసులు తిరిగి వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అవినాష్ విఙ్ఞప్తిపై సీబీఐ ఇప్పటిదాకా స్పందించలేదు. దీంతో సీబీఐ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.