ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్ వెనుక ఆంతర్యమేంటి..? టీబీజేపీలో ఏం జరుగుతోంది.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్‌షాను కలుస్తున్నారు. వస్తున్నారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఈ వరుస భేటీలకు కారణం ఏంటన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో వివరణ ఇస్తున్నారు. అయితే పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం టి. BJP అధ్యక్ష పదవికోసంపెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోందన్న వాదన కాస్త గట్టిగానే వినిపిస్తోంది.

Follow us

|

Updated on: May 21, 2023 | 8:11 PM

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అధ్యక్షపదవి కోసం ఇటీవల ఓ వర్గం ఢిల్లీ వెళ్లిందా? ఇంతకీ హైకమాండ్ మనసులో ఏముంది? ఎన్నికల వరకూ ప్రస్తుత అధ్యక్షుడే కొనసాగుతారా? మార్పుచేర్పులు ఏమైనా ఉంటాయా?

కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్‌షాను కలుస్తున్నారు. వస్తున్నారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఈ వరుస భేటీలకు కారణం ఏంటన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో వివరణ ఇస్తున్నారు. అయితే పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం టి. BJP అధ్యక్ష పదవికోసంపెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోందన్న వాదన కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అధ్యక్షుడిగా బండి సంజయ్‌ 3 ఏళ్ల టర్మ్ ముగిసింది. మరో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఇప్పటికిప్పుడు ఆయన్ను మార్చి మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అసలు హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది అన్న అంశంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో చర్చించిన తర్వాత .. అధ్యక్ష పదవిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వివేక్‌, రాజగోపాల్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి నేతలు కూడా అమిత్‌ షాను కలిశారు.

అధ్యక్ష పదవి విషయంలో పార్టీ నేతల మధ్య వార్ నడుస్తోందన్న అంశంపై రాష్ట్ర నేతల ఆచితూచి స్పందిస్తున్నారు. అటు ఈ వాదనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఇప్పుడు మార్చే అవకాశమే లేదన్నారయన. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని… తామంతా ఒకే కుటుంబమని చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్‌, ఈటల మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించడం కోసం ఈటల నేతృత్వంలోని ఓ టీమ్ ఖమ్మం జిల్లా వెళ్లింది. అయితే తనకు ఆ సమాచారం లేదని చెప్పారు బండి సంజయ్..!

ఈటల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే బండి సంజయ్‌ కూడా హస్తిన వెళ్లారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగతమని.. పార్టీ పెద్దలను ఎవరినూ కలవలేదని చెబుతున్నారు. మొత్తానికి టి. బీజేపీలో అలజడి టికప్పులో తుఫాన్‌ మాదిరిగానే చల్లారుతుందా? లేక కొత్త ట్విస్టులు ఏమైనా ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది..