Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekend Hour: రంజుగా మారుతోన్న ఏపీ రాజకీయం.. ఉత్తరాంధ్ర కేంద్రంగా పదునెక్కుతోన్న వ్యూహాలు

Weekend Hour: రంజుగా మారుతోన్న ఏపీ రాజకీయం.. ఉత్తరాంధ్ర కేంద్రంగా పదునెక్కుతోన్న వ్యూహాలు

Shaik Madar Saheb

|

Updated on: May 21, 2023 | 7:10 PM

ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. ఉత్తరాంధ్ర కేంద్రంగా వ్యూహాలు పదునెక్కుతున్నాయి.! పోయినచోటే వెతుక్కునే పనిలో ఉంది తెలుగుదేశం. అందుకే దూకుడు పెంచింది.! వైసీపీ కూడా కౌంటర్ పాలిటిక్స్ మొదలు పెట్టింది. అభివృద్ధి పనుల్ని పరుగులుపెట్టిస్తోంది. రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా హైవోల్టేజ్ హీట్ తప్పదా? ఎవరి గేమ్‌ప్లాన్ ఎలా ఉండబోతోంది?

ఒకప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో సీన్‌ పూర్తిగా రివర్స్ అయింది. ఘోరపరాభవం ఎదురైంది. మొత్తం మూడు జిల్లాల పరిధిలో 34 సీట్లుంటే టీటీడీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే గెలిచింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు, విశాఖలో నాలుగు సీట్లు వచ్చాయి. విజయనగరం జిల్లాలో అయితే అసలు ఖాతానే తెరవలేదు. ఇక రాయలసీమ సంగతి కూడా అంతే. మొత్తం 52 సీట్లలో సైకిల్‌కు దక్కినవి కేవలం 3 మాత్రమే. 2024 ఎన్నికలపై భారీగా హోప్స్ పెట్టుకున్న తెలుగుదేశం ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలపై కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది. పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన MLC ఎన్నికల్లో ఉత్తరాంధ్ర సీటుని కైవసం చేసుకున్న తర్వాత జోష్‌ మరింత పెరిగింది. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. చంద్రబాబు కూడా వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే విశాఖలో 3 రోజులపాటు మాకాం వేశారు చంద్రబాబు. పెందుర్తి, ఎస్‌.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తానికి పోయినచోటే తిరిగి వెతుక్కునే పనిలో పడింది తెలుగుదేశం.

టీడీపీ దూకుడుకు బ్రేక్ వేసే దిశగా కౌంటర్ పాలిటిక్స్ చేస్తోంది అధికార వైసీపీ. చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే అభివృద్ధి పనులనూ పరుగులు పెట్టిస్తోంది. ఇటీవలే భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు CM జగన్. సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే కాపురం అని ఇప్పటికే ప్రకటించారు కూడా. వీలైనంత త్వరగా స్టీల్ సిటీ నుంచే పరిపాలన మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. విశాఖ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎప్పుడూ లేని విధంగా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయడం ద్వారా.. టీడీపీకి చెక్‌ పెట్టాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

మొత్తానికి విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయం హీటెక్కనుంది. సాగర తీరంలో సరికొత్త పొలిటికల్ కెరటాలు ఎగిసిపడనున్నాయి. మరీ వార్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.