Telangana: అకాల వర్షాలతో రైతన్నల ఆగమాగం.. కొనేవాళ్లు లేక, దాచుకోలేక అల్లాడిపోతున్న కర్షకులు

తెలంగాణలో రైతుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయ్‌!. ఓవైపు అకాల వర్షాలు ఆగం చేస్తే, ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. జడివానకు పదేపదే ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఇటు కొనేవాళ్లు లేక, అటు దాచుకోలేక..

Telangana: అకాల వర్షాలతో రైతన్నల ఆగమాగం.. కొనేవాళ్లు లేక, దాచుకోలేక అల్లాడిపోతున్న కర్షకులు
Telangana Farmers
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 7:53 AM

తెలంగాణలో రైతుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయ్‌!. ఓవైపు అకాల వర్షాలు ఆగం చేస్తే, ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. జడివానకు పదేపదే ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఇటు కొనేవాళ్లు లేక, అటు దాచుకోలేక నరకయాతన పడుతున్నారు రైతులు.

అన్నదాతలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒకవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం రైతన్నను అంతులేని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయ్‌. పంట పండించడం ఒకెత్తయితే… దాన్ని అమ్ముకోవడం అతిపెద్ద సవాల్‌గా మారింది. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి పంట పండిస్తే… ఆ పంటను అమ్ముకోవడానికి కూడా నానా తిప్పలు పడాల్సి వస్తోంది. చేతికొచ్చిన ఇటు పంటను అమ్ముకోలేక, అటు దాచుకోలేక అంతులేని ఆవేదన అనుభవిస్తున్నారు రైతన్నలు.

అకాల వర్షాలకు ధాన్యం వర్షార్పణమైతే, మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు రైతులు. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోసి అమ్ముకొని, ఎంతోకొంత సొమ్ము చేసుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ల ఆశలు ఆడియాశలయ్యాయ్‌. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మళ్లీ తడిచిముద్దైంది. దాంతో, గుండెలు బాదుకోవడం తప్ప మరో దిక్కే లేకుండా పోయింది రైతులకు.

ఇవి కూడా చదవండి

జోరువానకు జగిత్యాల జిల్లాలో పెద్దఎత్తున ధాన్యం తడిసిముద్దైంది. వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ఖమ్మం… ఇలా ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. ఏ రైతును కదిపినా అదే గోస. తడిచిన ధాన్యాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నాడు రైతన్న. ఒకవైపు వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు రైతులు. రకరకాల కారణాలతో ధాన్యం కొనకుండా వేధిస్తున్నారంటూ మెదక్‌లో రోడెక్కారు రైతులు.

ధాన్యం కొనుగోళ్లపై అధికారుల మాటలన్నీ ప్రకటనల వరకే ఆగిపోతున్నాయ్‌. దాంతో, మళ్లీమళ్లీ నష్టపోతున్నాడు రైతన్న. ఇటు కొనేవాళ్లు లేక, అటు దాచుకోలేక నరకయాతన పడుతున్నారు. తమను ఆదుకునేవాళ్లే లేరా అంటూ దీనంగా ఆకాశం వైపు, ప్రభుత్వంపై చూస్తున్నారు రైతన్నలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!