AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పల్‌ స్టేడియంలో దొంగల చేతివాటం.. భారీ ఎత్తున సెల్‌ఫోన్లు మాయం

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో కేటుగాళ్లు చేతివాటం చూపారు. వీక్షకుల సెల్‌ ఫోన్లు పెద్దఎత్తున కాజేశారు. వేలాది మంది మధ్య సాధారణ అభిమానుల్లా దూరిపోయి ఫోన్లు మాయం చేస్తున్నారు. ఇలా రోజుకి సగటున 20 నుంచి 40 ఫోన్లు చోరీకి..

ఉప్పల్‌ స్టేడియంలో దొంగల చేతివాటం.. భారీ ఎత్తున సెల్‌ఫోన్లు మాయం
Uppal Stadium
Srilakshmi C
|

Updated on: May 22, 2023 | 11:30 AM

Share

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో కేటుగాళ్లు చేతివాటం చూపారు. వీక్షకుల సెల్‌ ఫోన్లు పెద్దఎత్తున కాజేశారు. వేలాది మంది మధ్య సాధారణ అభిమానుల్లా దూరిపోయి ఫోన్లు మాయం చేస్తున్నారు. ఇలా రోజుకి సగటున 20 నుంచి 40 ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఆటపై మునిగిపోయిన అభిమానులు కొందరు స్టేడియంలో ఫోన్లు చేజార్చుకుంటే.. ఇంకొందరమో దొంగలకు సమర్పించుకున్నారు. మ్యాచ్‌ ముగిశాక ఫోన్‌ పోయిన విషయం తెలుసుకుని కంగుతింటున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీల పుణ్యమా అని పర్సులు, జేబుల్లో నగదు జేబులో ఉంచుకునేవారి సంఖ్య తరిగిపోయింది. దీంతో పిక్‌ పాకెటర్లు రూటు మార్చి సెల్‌ఫోన్ల చోరీలపై దృష్టిపెట్టారు. దీనికితోడు స్మార్ట్‌ ఫోన్లు వినియోగం పెరిగిపోవడంతో కాజేసిన ఫోన్‌ను ఎంతో కొంతకు అమ్మేసుకుని సొమ్ము చేసుకోవచ్చనే ఉద్దేశంతో పద్ధతి మార్చారు. అందరితోపాటు టికెట్‌ కొని జనసామాన్యంలో కలిసిపోతున్నారు.

ఆనక ఆట మొదలెట్టాక.. ఆటపై అధిక దృష్టిపెట్టేవారిని గమనించి క్షణాల్లో ఫోను మాయం చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ జరిగే రోజుల్లో మెట్రోరైళ్లు, బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటోంది. బస్సులు, మెట్రో దిగాక స్టేడియంలోకి వేలాది మంది వెళ్తుంటారు. ఈ సమయంలోనూ ఫోన్లు మాయం అవుతున్నాయి. పైగా ఫోన్‌ తప్ప ఇతర వస్తువుల్ని లోపలికి అనుమతించరనే విషయంపై చాలామందికి అవగాహన లేకపోవడంతో బ్లూటూత్‌, డిజిటల్‌ వాచీలు, ఇయర్‌ ఫోన్లు, బ్యాగులు గేటు వద్ద వదిలేస్తున్నారు. వీటిని గమనిస్తున్న కేటుగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. చేస్తున్నారు. మరోవైపు బాధితులు ఎక్కువ మంది ఫిర్యాదు చేయడానికి ముందుకురావడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.