Mancherial: తోటి కోతి మృతి.. ఆగ్రహంతో షాపు యజమానిపై దాడి చేసిన కోతుల గుంపు

తోటి కోతి మృతి చెందిందన్న ఆగ్రహంతో మిగతా కోతులన్నీ దాడికి దిగాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఓ మెడికల్ షాపులో ఆదివారం ఒక కోతి ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో ఆగ్రహించిన మిగతా కోతులు ఆ దుకాణంపై దాడి..

Mancherial: తోటి కోతి మృతి.. ఆగ్రహంతో షాపు యజమానిపై దాడి చేసిన కోతుల గుంపు
Monkeys
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 12:37 PM

తోటి కోతి మృతి చెందిందన్న ఆగ్రహంతో మిగతా కోతులన్నీ దాడికి దిగాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఓ మెడికల్ షాపులో ఆదివారం ఒక కోతి ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో ఆగ్రహించిన మిగతా కోతులు ఆ దుకాణంపై దాడి చేశాయి. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోతులన్నీ ఆగ్రహంతో మెడికల్‌ షాప్‌లోని వస్తువులను చిందరవందర చేస్తూ కాసేపు బీభత్సం సృష్టించాయి. అసలేం జరిగిందంటే..

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట బీట్ బజార్‌లోని అపోలో ఫార్మసీలోకి రెండు కోతులు ప్రవేశించాయి. భయపడ్డ కస్టమర్లు వాటిని తరిమే ప్రయత్నం చేశారు. ఆకస్మాత్తుగా షాపు డోర్ మూయడంతో అందులో ఇరుక్కొని ఓ కోతి మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన మిగతా కోతులు ఒక్కసారిగా ఆ దుకాణంపై దాడి చేశాయి. దుకాణం గ్లాస్ డోర్‌పై దూకుతూ, వస్తువులను విసురుతూ కొద్దిసేపు గందరగోళం సృష్టించాయి. తర్వాత మృతిచెందిన కోతిని తీసుకొని పక్కనే ఉన్న సందులో పెట్టుకొని కోతులన్నీ చుట్టూ చేరాయి. ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా విచిత్రంగా ప్రవర్తించాయి. మనుషుల మాదిరిగానే.. తమలో ఒకరు చనిపోతే మిగతా కోతులన్నీ ఎంతో భావోధ్వేగానికి గురయ్యాయి. కొద్దిసేపటి తర్వాత కోతులన్నీ వెళ్లిపోవడంతో, మృతి చెందిన కోతిని ఆ దుకాణం సిబ్బంది తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.