AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: ‘ఒక్క రోజులోనే 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకం పూర్తి.. దేశంలోనే ఇది రికార్డు’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను ఒకే రోజు నియామకం చేపట్టామని మంత్రి హరీష్‌రావు అన్నారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. 'వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్..

Minister Harish Rao: 'ఒక్క రోజులోనే 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకం పూర్తి.. దేశంలోనే ఇది రికార్డు'
Minister Harish Rao
Srilakshmi C
|

Updated on: May 22, 2023 | 1:02 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను ఒకే రోజు నియామకం చేపట్టామని మంత్రి హరీష్‌రావు అన్నారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు, సిబ్బంది నియామకాలు భారీగా చేపడుతున్నాం. వైద్య విద్యలో దేశంలోనే ఇది రికార్డ్. ఈ సంత్సరంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్మెంట్ చేశాం. గత నెలలో 900 మందికి పైగా ఉద్యోగాలు పొందారు. 1331 మంది ఆయుష్ పారా మెడికల్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పెర్మినెంట్ చేస్తాం. తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చాం. ఆరోగ్య శాఖలో మరో 9,222 పోస్టులకు మరో రెండు నెలల్లో నియామకాలు చేపడుతామని’ అన్నారు.

పేదలకు అందుబాటులో మంచి వైద్యం

రోగుల ఆరోగ్యాన్నీ నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. రోగులను ఆత్మీయంగా పలకరించాలి. ఒకటి రెండు ఘటనలతో ఆరోగ్య శాఖ పెరు చెడిపోకూడదు. ప్రాణాలు కాపాడే గొప్ప వృత్తి వైద్యులది. గతంలో జబ్బులు వస్తే ఆ కుటుంబమే ఆర్ధికంగా చితికిపోయేది. ఇప్పుడు జిల్లాల్లో సూపర్ స్పెషలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు మంచి వైద్యం అందుతోంది. వరంగల్ లాంటి టీచింగ్ ఆస్పత్రుల్లోనూ విజయవంతంగా ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్‌లు జరుగుతున్నాయి. భారత్‌లో అత్యధిక ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్‌లు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 100% ఇన్సిట్యూషనల్ డెలివారీలు తెలంగాణలో జరుగుతున్నాయి. ప్రతి నెల 11న మీ అందరితో రివ్యూలో మాట్లాడుతాను. రివ్యూ మీటింగ్‌లో సమస్యలు, సొల్యూషన్స్ గురించి చర్చిద్దామన్నారు.

తెలంగాణ వస్తే ఎం వస్తది అన్నారు.. వైద్యం వచ్చింది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీ డయగగ్నోస్టిక్స్‌లలో 54 టెస్టులు చేస్తున్నాం. వచ్చే నెల నుండి 134 టెస్ట్ లు అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వాలు మెడికల్ విద్యను, వైద్యాన్ని పట్టించుకోలేదు. దాని వల్ల చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకి వెళ్లి చదువుకున్నారు. తెలంగాణ వస్తే ఎం వస్తది అని మాట్లాడిన వారికి ఇది సమాధానం…వైద్య విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. 4 ఏళ్ల క్రితం ఇచ్చిన ఎయిమ్స్ నిర్మాణానికి వచ్చిన మోడీ ఎంత హడావిడి చేశారో చూసాం. కానీ మనం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నాం. శ్రమ కృషి వల్ల ఇది అంత సాధ్యం అయింది. ప్రతి లక్ష మంది కి 22mbbs సీట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ. వైద్య సేవల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శం అని మంత్రి హరీష్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!