వడగండ్లు, ఉరుములు మెరుపులకు దెబ్బతిన్న వందేభారత్‌.. ఇవాళ రైలు రద్దు

దేశంలో వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ట్రైన్ల నాణ్యత విషయంపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాలో ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మూడో రోజే ఆగిపోవడం వివాదాశంగా మారింది. ప్రధాని మోదీ ఒడిశాలో తొలి..

వడగండ్లు, ఉరుములు మెరుపులకు దెబ్బతిన్న వందేభారత్‌.. ఇవాళ రైలు రద్దు
Puri Howrah Vande Bharat Express
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 12:06 PM

దేశంలో వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ట్రైన్ల నాణ్యత విషయంపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాలో ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మూడో రోజే ఆగిపోవడం వివాదాశంగా మారింది. ప్రధాని మోదీ ఒడిశాలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌ మోడ్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూరీ – హౌరా మధ్య నడుస్తున్న ఈ రైలు ఆదివారం కురిసిన వానకు మార్గం మధ్యలోనే ఆగిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానకు రైలు ముందు భాగం విరిగిపోయింది. అద్దాలు, కిటికీలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రారంభించిన మూడో రోజే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మార్గం మధ్యలోనే మొరాయించింది. తుఫాను కారణంగా రైలు ఓవర్‌హెడ్ వైర్‌పై చెట్టు పడిపోయిందని, అందువల్లనే పాంటోగ్రాఫ్ విరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉరుములతో కూడిన వర్షం కారణంగా డ్రైవర్ క్యాబిన్ ముందు అద్దాలు, పక్క కిటికీలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్టేషన్ మేనేజర్ చెప్పారు.

ఏసీ పనిచేయకపోవడం, రైలులో బ్రేక్‌డౌన్‌ జరిగి చాలాసేపు విద్యుత్‌ సరఫరా ఆగిపోయిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. వర్షం పడుతున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. క్యాటరింగ్ సిబ్బంది కూడా చాలా సమయంపాటు తమ విధులను ఆపివేశారని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు వాపోయింది. సుమారు నాలుగు గంటలపాటు మరమ్మత్తులు నిర్వహించిన తర్వత.. డీజిల్ ఇంజిన్ సహాయంతో సోమవారం తెల్లవారుజామున హౌరా స్టేషన్‌కు తరలించారు. మరమ్మత్తుల చేస్తున్న కారణంగా పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలను సోమవారం రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి